పుట:Aandhrakavula-charitramu.pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

బుద్ధి కిది నన్నెచోడుని ప్రాచీనతకుఁ గారణముగాఁ గానcబడదు గాని యాతనికిఁ గల కర్ణాటక భాషాపక్షపాతిత్వమునకుఁ గారణముగాఁ గన బడున్నది. నన్నయకాలమునకే క్రౌంచపదము వృత్తమయ్యెనcట! అయినపక్షమున యతిస్థానము లన్నియు మొదటియక్షరముతో మైత్రికలవయి యుండుట యాంధ్రభాషాకవిత్వమర్యాద. ఈ మర్యాదను వదలి కర్ణాటకభాషాకవిత్వమర్యాద నవలంబించుట తెలుఁగుసంప్రదాయమునకు విరోధము. నన్నయభట్టెక్కడను దాను రచించిన భారతభాగమునందు క్రౌంచపదవృత్తమును వాడియే యుండలేదు. అందుచేత నాతని కాలమున క్రౌంచపదవృత్తము వాడుకలో లేదనుట స్పష్టము ఆతని కాలమునందును, తత్పూర్వమునందును అక్కరలు మొదలైనవి యొక్కువ వాడుకలో నున్నవి నన్నయభారతమునం దక్కరలు మిక్కిలిగా నుండుటయే కాక నన్నయకు నూఱు సంవత్సరములు పూర్వమందుండిన యుద్దమల్లుని శాసనములో నన్నియు మధ్యాక్కరలే యున్నవి. ఇటీవల నక్కరలు వాడుకలోనుండి తొలఁగుటయు క్రౌంచపదవృత్తము వాడుకలోనికి వచ్చుటయుc దటస్థించినది. నన్నెచోడుని కుమారసంభవమునం దక్కరలు లేక పోవుటయు, గ్రౌంచవదవృత్తముండుటయు నతఁడు నన్నయకు మిక్కిలి తరువాతివాఁ డని స్థాపించుటకు గొప్ప కారణముగా నున్నది. కవిజనాశ్రయమునఁ జెప్పఁబడిన క్రౌంచపదలక్షణ మిది -

           "పంచ శరాభా ! సంచితపుణ్యా ! భమసభనననయ పరిమిత మైనన్
            క్రౌంచపదాఖ్యం బంచితమయ్యెన్ గ్రయయతిదశ వసు కలితముగాఁగన్

మన నన్నెచోడకవి యీ తెలుఁగులక్షణమును పాటింపక విశ్రమవిషయమున

            శీతకరోర్వీవాత శశాంకర్ యుగమితసురపురనివహదక డెయోళ్
            భూతగణేశం భూత శరాశాగజదొళె యతిగళుమెసెదిరె పెసరిం
            నీతియుతేకేళ్ నాతిశయోక్తిక్రమదొళే నెగళ్దుదిదతిశయరచనో
            పేతమశేషోర్వీతళకం క్రౌంచపద మిదతిశయపదరచనెగళిం"