Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

అఱపొఱడన్న యసాధారణ పదమును వాడెను. దానినే నన్నెచోడుఁడును కుమారసంభవములోని ఆ.6-౩౩ పద్యములో

   సీసపాదము.[1] ఈ కందుcబండ్లు బఱిగిగడ్డంబులును నఱ
               పొఱడు ల నంటు రూపులును గుఱుచ.

పయియట్లు ప్రయోగించెను. ఒక కవి యింకొకకవి యొక్క గ్రంధమును జదివి యందుండి యేమయిన గ్రహించినట్లు తెలిసికొనుటకు మొదటి కవి యొక్క విశేషప్రయోగములనుబట్టి తెలిసికొనవలెనే కాని సర్వకవి జన సామాన్యము పైన ప్రయోగములనుబట్టి నిశ్చయించుటకు వలను పడదు. నన్నయభట్టాదిపర్వమునందు

   చ. పొలుపుగఁ బూసి కట్టి తొడి భూరివిభూతి ప్రకాశితంబుగాఁ
       గలయఁగఁ దత్పురీజనులు కాంస్య మృదంగక శంఖ భేరి కా
       హళ పటహధ్వనుల్ చెలఁగ నాటలుఁ బాటలు నొప్పనెల్లవా
       రలు చని చేసి రర్చనలు రై వతకాద్రికి నుత్సవంబుతోన్

అనెడి యష్టమాశ్వాసములోని పద్యములో 'తొడిగి" యని యుండవలసిన సామాన్యరూపములోని 'గి" వర్ణకమును దీసివేసి 'తొడి' యని విశేష ప్రయోగమును జేసెను. దీనిని జదివియే నన్నెచోడుఁడు తనకుమారసంభవము పంచమాశ్వాసములో

      'కేసరరాజీవ కేయూరములు తొడి
       రాజీవకర్ణపూరము లమర్చి.....' [పద్యము 20]

అను సీనపాదమునందు 'తొడి' యని ప్రయోగించి యున్నాఁడు.

   ఉ. వీండె ఖలుండు దక్షుఁ డను వీఱిఁడిపాఱుఁడు వీఁడు సర్వవ
       ధ్యుం డెడసేయ కుండు శివదూషకునాలుక గోసి యుప్పు నిం
       పుండు త్రపుద్రవమ్మొడలఁ బూయుఁడు లోహము కాచి నోరఁ బో
       యుండు దురాత్ము చర్యపట మొల్వుఁడు కస్నెలు మీఁటుఁ డుక్కఱన్
                                                   [ఆ. 2 - 84 ]

  1. [కందుcబండ్లుఁ బఱకి గడ్డంబులును నఱ పొఱడులనంటు రూపులునుఁగుఱుచ - అని మద్రాను, విశ్వవిద్యాలయ ముద్రిత ప్రతి.]