227
న న్నె చో డ క వి
జగన్నాథ విజయము నన్నెచోడుని సమకాలీనుఁడై న రుద్రభట్టుచే రచియింపఁబడినది. "నన్నెచోళునియత్యపూర్వభావములు మల్లినాథపురాణ జగన్నాధ విజయాది కర్ణాటకకావ్యములలో మార్పులేక యున్నవి" అని సంపాదకులు వ్రాయుచున్నారు. ఇందుఁ బేర్కొనఁబడిన మల్లినాధపురాణము 1105-వ సంవత్సరప్రాంతములం దున్న నాగచంద్రునిచే రచియింపఁబడినది. కుమారసంభవములోని భాగములు తద్గ్రంథకర్త యగు నన్నెచోడునితో సమకాలికులను, పూర్వకాలికలును నగు తెలుఁగురాని కన్నడ కవులచేఁ జేకొనఁబడిన వని చెప్పుటే యుచితమో, ఆ కవుల కాలపువాఁడును, తరువాతికాలపువాఁడునునై కన్నడము వచ్చిన నన్నెచోడుఁడే వారి కర్ణాటక కావ్యములనుండి కైకొనియెనని చెప్పుటయే యుచితమో, చదువరులే తెలిసికోఁగలరు. ఇతఁడు కర్ణాటకకావ్యములలోనుండి తన కుమారసంభవము నందు సంగ్రహించిన కన్నడ పదబృందములోని కొన్ని పదముల నిందుఁ జూపుచున్నాను.
సీసపాదము. అనులేపనములు మండనములు లేకయు
భాసురాంగములింత దేసియగునె. [ ఆ.6.పద్య.52 ]
ఇందలి దేసి పదము సుందరమైన యను నర్థ మిచ్చెడు కర్ణాటకపదము.
క. దోస మనేగుణదవోలు
ద్భాసిసి కన్నడదళొల్దుపూర్వాచార్యర్
దేసియనే నిఱిసిఖండ
ప్రాసమనతిశయమదెందు యనియం మిక్కర్.
(కవిరాజమార్గము.)
ఈ కవిరాజమార్గకర్త 814-887-వ సంవత్సరముల మధ్యమున నున్న నృపతుంగుఁడు,
వెంచలు.
చ. ఎలమిన పూరి మేసి సెలయేఱుల నీరులు దాగి మేలి వెం
చల నెలమావిజొంపములఁ జల్లని నీడల నిల్చి పొల్పి మQ