Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

226

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

అను కాలాముఖమఠమునకుఁ బ్రక్కనుండు జైనమఠములోని త్రైలోక్య మల్లుని క్రీ. శ. 1127 శాసనశ్లోకమును జూచి వ్రాయబడినది. జైనులు శబ్దార్థ చౌర్యమునకు వెనుదీయరని సంపాదకులు వ్రాసినను పయి శ్లోకమును రచియించిన జై_నసంస్కృత కవి ముందు చేయఁబోయెడి తెలుఁగు గ్రంథమునుండి యీ శ్లోకమును దొంగిలించి యుండఁజాలఁడు.

          సీ. కరలత లందంద కామపాశంబుల
                         నదిమి బంధించుచున్నట్లు బిగియ
              నొదవఁ బేర్పిందులఁ బదనై న పూఁత లం
                         గమునకు వజ్ర లేపములుగాఁగఁ
              బులక లొండొరుల మేనుల నుచ్చిపోయి డ
                         గ్గఱ మొల లిచ్చినకరణిగాఁగఁ
              గనకంపుఁబ్రతిమలు గాఁచి యంటించిన
                         ట్లొడఁగూడి తనువు లొండొంటిఁ గదియ

           గీ. దగఁగ నొక్కతలకు మొగములు రెండైన
              పగిది దలలు మాఱుమొగము పడఁగ
              గీఱి మేను మేను [1] దూఱ గాఢాలింగ
              నంబు చేసి రంగనయుఁ బ్రియుండు.

అణు కుమారసంభవ నవమా శ్వాసములోని 149-వ పద్యములోని 'యొక్క తలకు రెండు మొగము లో యను నుత్ప్రేక్ష తక్కఁ దక్కిన భావము లన్నియుఁ గల" వని సంపాదకులు కన్నడ జగన్నాధవిజయము లోని యీక్రింది పద్యమును పూర్ణముగా నుదాహరించి యున్నారు.

          మ. ఉరదింపెర్మొలెబెంగెమూడె చెమర్గళ్ బల్వజ్రలేపంబొ లా
              గిరె, కీల్గొట్ట బెడంగనీయె పులకం, తోళ్తోళ్గేగంటిక్కిదం
              తిరె, మెమ్మెయ్యొళడంగు వంతమరె, గాఢాలింగనంగెయ్దు న
              ల్లరదేనిర్దరొకాసి బెచ్చ తెఱదిం శ్రీసత్యభామాచ్యుతర్".

  1. ["మేన దూఱి - పాఠాంతరము]