221
న న్నె చో డ క వి
యాంతరంగికములగు కొన్ని పోలికలనుబట్టి నిర్ణయింప యత్నించిరి. ఇట్లీ కవి కాలనిర్ణయమునకు నిష్కృష్ణమగు శాసనాధారము లేకపోవుటచే నాంతరంగిక నిదర్శనములనుబట్టి క్రీ శ 940 మొదలు క్రీ శ. 1300 వరకు గల నడిమి కాలమున నీతని యునికి యూగులాడు చుండవలసి వచ్చినది.
ఈ మధ్యకాలము ముఖ్యముగా మూడు తరగతులుగా విభాగింపదగియున్నది. ఒకటి నన్నయకు పూర్వమని రెండవది నన్నయకు సమకాలికము-లేదా నన్నయ తిక్కనలకు నడిమి భాగమని, మూడవది తిక్కనకు తరువాతికాల మని. ఈ మూడవది - నన్నిచోడుఁడు తిక్కనకు తరువాతికాలపువాఁడను వాదము తక్తినవానికంటె నర్వాచీనము. శాసన నిదర్శనము నిష్కృష్టమైనదిగాఁ గానఁబడనందున నాంతరంగిక నిదర్శనమగు రచనలోని పోలికలనుబట్టి విచారింపఁగా గొన్ని విషయముల తిక్కన కేతనల భావములను, రచనలను నన్నిచోడు డనుకరించెనని శీలక్ష్మీ పతి శాస్త్రిగారికి తోచుటచే నాయనయే యా మూడవ పక్షవాదమును తొలుత ప్రతిపాదించిన వారైనారు. ఇంక ననేకవిధములగు పోలికలు ఇతర కవులతో సమానముగఁ గనఁబడుచుండఁగా, వారు చూపిన పోలికలైనను చోళుని రచననే వారనుకరించి యుండఁగూడదా ? యను సందేహమును నిశ్శేషముగాఁ దీర్చునవి కాకపోవుటచే తిక్కన తరువాతి వాఁడను నర్వాచీన వాదము నంతగా మనము పాటింపవలసిన యావశ్యకత కనఁబడదు.
ఇఁక నన్నయకుఁ బూర్వుఁడనునది తొలివాదము. కవి తననుగూర్చి చెప్పికొనిన గ్రంధస్థ విషయములలో తల్లిదండ్రుల నామములు కలవు . .పురాతన శాసనములఁ బరిశోధింపఁగాఁ బెక్కండ్రు నన్నిచోడు లగపడు చున్నారు గాని వారిలో గొందఱు మాత్రమే చోడబల్లియను రాజునకు బుత్రులుగాఁ బేర్కొనఁబడియైన నుండిరి గాని, ఎందునను దల్లి పేరు లేనందున నిస్పందేహముగా నిర్ణయించుటకు వీలే లేకున్నదనుట వాస్తవము. నన్నిచోడుఁడు కావేరీతీరమునందలి యొరయూరి కధిపతినని, టెంకణాదిత్యుండనని చెప్పుకొనినంత మాత్రముచేత-అతని తండ్రి చోడబల్లి పాకనాటి యందిరువదియొక్క వేయింటి కధీశుఁడని చెప్పుచుండఁగా - నీతఁడు