పుట:Aandhrakavula-charitramu.pdf/243

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

216

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

బల్లిచోడుఁడును త్రిభువనమల్లచోడుఁడును ఏకపురుషుఁ డనుకొనుట సముచితముగాఁ గనఁబడు చున్నది.

మైసూరు చోడశాసనములలో మల్లి దేవచోడుని శిలా శాసనములు రెండు కానఁ బడుచున్నవి. వానిలో చళ్ళకెరెతాలూకాలోని మహాదేవపురమందలి వీర భద్రాలయముయొక్క తూర్పుగోడమీఁద నున్నది 43 సంఖ్యగల 1108 వ సంవత్సరపుది; ఓబలపురసిద్దరామేశ్వర దేవాలయములో దక్షిణమున శిల మీఁద నున్నది 21 వ సంఖ్యగల 1147 వ సంవత్సరపుది. ఈ రెండు శాసనము లును ఒక్కరి పేరివే యైనను మొదటిదానియందు "శ్రీమన్మహామండలేశ్వర త్రిభువనమల్లమల్లిదేవ చోళమహారా" జనియు, రెండవదానియందు 'శ్రీమన్మహామండలేశ్వర జగదేకమల్ల మల్లిదేవ చోళ మహారా' జనియు ఉన్నది. కారణాంతరములచేత శాసనములో నొక్కరికే వేఱువేఱు పేరు లుండవచ్చు ననియు, ఈ ప్రకారముగానే త్రిభువనబల్లి చోడమహారాజును బల్లిచోడ మహారాజు నొక్కరే యగుట విరుద్ధము కాఁజాల దనియు, చూపుట కొఱకు మాత్రమే యీ శాసనముల నుదాహరించితిని గాని వేఱు ప్రయోజన ముద్దేశించి కాదు. అయినను కాల సామ్యమును, నామసామ్యమును బట్టి చూడగా నా త్రిభువనబల్లిచోడమహారాజును , నీ త్రిభువనమల్లచోడ మహారాజును నొక్క-రే యయియుండవచ్చునేమో యని సందేహము కలుగుచున్నది. ఉభయులును సూర్యవంశజులు; కాశ్యపగోత్రజులు: కరికాలచోళకులాభరణులు. ఈ యూహ నిజమే యయి త్రిభువనబల్లి చోడ మహారాజు నకు మహిసూరులో కూడ కొంత రాజ్య ముండియుండినపక్షమునను, మన నన్నెచోడకవిరాజశిఖామణి బ్రతిభువనబల్లి చోడ మహారాజు పుత్రుఁడే యయిన పక్షమునను, నన్నెచోడునికిఁ గన్నడభాషలో విశేష పాండిత్య ముండె ననుటకుఁ దగిన కారణ మున్నది. పూర్వోక్తములై న రెండు శాసనములలో 43 వ సంఖ్య గలదానిలో క్రీ. శ. 1074మొదలు కొని 1126 వఱకును రాజ్యపాలనము చేసిన త్రిభువనమల్ల చక్రవర్తి యొక్క బిరుదావళి'సమస్తభువనాశ్రయం.......రాజాధిరాజపరమేశ్వరం........సత్యాశ్రయకులతిలకం' మొదలయిన విశేషణములతోఁ జెప్పఁబడినతరువాత చోడబల్లి నిగూర్చి"ఒరయూర పురవరాధీశ్వర, కరికాలచోళకులాంబరద్యు