215
న న్నె చో డ క వి
చోడునే నన్నెచోడకవినిగాఁ జెప్పిన శేషగిరిరావుగారి సిద్ధాంతము నేల నిరాకరింపవలెను ? శ్రీసతి మాబలదేవినామాంతరము కాఁగూడదా ? శాసనములలో నొక్కనినే చోడపల్లి, చోడవల్లి చోడమల్లి, బల్లిచోడుఁడు, బల్లయ చోడుఁడు మొదలైన నామములతో వ్యవహరించుచుండుట మనము చూచుచుండ లేదా ?
డి-48 సంఖ్యగల ది 1145-46 సంవత్సరపు నెల్లూరి శాసనములో
"స్వస్తి చరణసరోరుహవిహితలోచన త్రిలోచనప్రముఖాఖిల పృథివీశ్వర కారిత కావేరీతీర కరికాలకులరత్న ప్రదీపాహితకుమారాంకుశ శ్రీమన్మహామండలేశ్వర బల్లిచోడ మహారాజులు"
అని బల్లిచోడుని శాసనములో నున్నది. ఓ-19 సంఖ్యగల 1153-54 వ సంవత్సరపు నెల్లూరి శాసనములో నెనిమిదేండ్లకుఁ దరువాత
"స్వస్త్రి చరణసరోరుహవిహితవిలోచనత్రిలోచన ప్రముఖాఖిల పృథివీశ్వర కారిత కావేరీతీర కరికాలకులరత్న ప్రదీపాహితకుమా రాంకుశ శ్రీమన్మహామండలేశ్వర త్రిభువనమల్ల దేవచోడ మహారాజులు"
అని బ్రతిభువనమల్ల చోడ దేవుని శాసనములో నున్నది; డి-49 సంఖ్యగల 1166-68 వ సంవత్సరపు నెల్లూరి శాసనములో మఱి పదుమూఁడేండ్లకుఁ దరువాత
"స్వస్తి చరణసరోరుహవిహితవిలోచన త్రిలోచన ప్రముఖాఖిల పృథివీశ్యర కారితకావేరీతీరకలికాలకుల రత్న ప్రదీపాహితకుమారాంకుశ శ్రీమన్మహామండలేశ్వరబల్లిచోడ మహిరాజులు......"
అని మరల బల్లిచోడుని శాసనములో నున్నది. 1145 వ సంవత్సరము లోను, 1166 వ సంవత్సరములోను బల్లిచోఁడుడు రాజ్యము చేయు చుండగా నడుమను 1153 వసంవత్సరమునందు త్రిభువన మల్ల దేవుఁడు మఱియొకఁడు రాజ్యము చేయుట సాధారణముగా సంభవింపదు గావునను, ఒక్క యక్షరమైనను హెచ్చు తగ్గు లేక మూఁడు శాసనములలోను బిరుదావళి యొక్కటిగానే యున్నదిగావునను, ఈ శాసనములలోఁ బేర్కొనఁబఢిన