Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

209

న న్నె చో డ క వి

నీ పుస్తకమునందు లేదు. జంగమ మల్లి కార్జునుని నొక్కనిని మాత్రమే కృతిపతినిగాఁ జెప్పెను గాని కవి తత్పూర్వుల నెవ్వరిని వర్ణించి యుండ లేదు. బల్లిచోడులవలెనే మల్లి కార్డునులును ననేకు లున్నారు. వారిలో కృతిపతి యే మల్లికార్డునుఁడో చెప్పుట సులభసాధ్యము కాదు. గ్రంథ సంపాదకులైన రామకృష్ణకవిగారు తమ పీఠికలో ముగ్గురు జంగమ మల్లికార్జునులను పేర్కొని వారిలో భృంగిరిటియవతార మగు పండితారాధ్య మల్లి కార్డునుఁడు కాఁ డనియు, శైవాచారగురుపరంపరలో వానప్రస్తాశ్రమవర్తి యగు యోగిమల్లి కార్డునుఁడు కాఁ డనియు, మొదటి యిద్దఱిని నిరాకరించి మూఁడవ వాడయిన కొలాముఖమల్లి కార్డునుఁడు కావచ్చునని యంగీకరించిరి. మూఁడవది పూర్వకవి ప్రశంస. ఈ పుస్తకమునందదియు గానఁబడదు. కవి వాల్మీకి, వ్యాసుఁడు, కాళిదాసుఁడు, భారవి, భాణుఁడు మొదలయిన సంస్కృత కవులను కొందఱిని ప్రశంసించి తెలుఁగు కవులను విడిచిపెట్టెను. అయినను సంస్కృత కవులను బేర్కొన్న తరువాత

             క. మును మార్గకవిత లోకం
                బున వెలయఁగ దేశికవితc బుట్టించి తెనుం
                గు నిలిపి రంధ్రవిషయ[1]మున
                జనసత్యాశ్రయుని తొట్టిచాళుక్య నృపుల్. [ ఆ.1-23 ]

అను పద్యమును, దాని తరువాత

            చ. సురవరులం గ్రమంబున వచోమణి సంహతిఁ బూజచేసి మ
                ద్గురుచరణారవిందములకుం దగ సమ్మతిఁజేసి కొల్చి వి
                స్తరమతులం బురాణకవి సంఘము నుత్తమమార్గసత్కవీ
                శ్వరులను దేశిసత్కవుల సంస్తుతిఁ జేసి మనోముదంబునన్.
                                                     [ ఆ.1-24 ]

  1. యం,బున జనఁజాళుక్యరాజు మొదలుగఁ బలువుర్. అనునది సరియైన పాఠము