208
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
క. 'కలుపొన్న విరులు పెరుగం
గలకోడిరవంటు దిశలఁ గలయఁగఁ జెలఁగన్
బొలుచు నొరయూరి కధిపతి
నలఘుపరాక్రముఁడఁ డెంకణాదిత్యుండన్.' [ ఆ 1 -54 ]
ఈ పద్యము మొదటినుండియు నద్భుతకల్పనముగాఁ గనఁబడుచున్నది, ఆ యూరిలో రాతిపొన్న చెట్లు పువ్వులతోఁ బెరుగుచున్నవcట ! రాతికోళ్ళు దిశలు మాఱుమ్రోయునట్లుగా కూయుచుండునcట ! ఆహా! ఏమి యాయూరి మాహాత్మ్యము!
పూర్వము చోళరాజు లెవ్వరో కావేరీతీరమున తిరుచునాపల్లికి సమీపమునందున్న యొురయూరు రాజధానిగా రాజ్యపాలనము చేసినందునఁ దరువాతి చోళరాజ శాఖలలోనివా రందఱు నొరయూరిపురాధీశ్వరుల మని చెప్పకొనుట యాచార మయి యున్నది. ఈ యాచారము ననుసరించియే నన్నెచోడుఁడును నొరయూరి కధిపతి నని చెప్పుకొనెను. రాజ్యపరిమితిని గూర్చి పుస్తకములో నింతవఱకాధారము లున్నవి అంతకంటె నెక్కువగాఁ జెప్పినచో దానికి బలవత్ప్రమాణము లున్నఁ గాని విశ్వాసార్హము కాదు. ఈ కవి గోదావరిసింహళమధ్య దేశము నేలె ననువారు తమ వాక్యమున కాధారములైన ప్రమాణములను జూపి ఋజువుచేయవలెను. మన కిప్పటికిఁ దెలిసినంతవఱకా కథనము నిరాధార మయి యవిశ్వసనీయమైనదిగాఁ గనుపట్టుచున్నది. ఈతని దిగ్విజయములును గోదావరీ సింహళ మధ్యదేశ పాలనమువంటివే. ఇఁక నీ కవియొక్క కాలనిర్ణయము చేయవలసి యున్నది. ఈ కాలనిర్ణయమునకు సాధారణముగా పుస్తకములలో మూఁడు నాలుగాధారములుండును. అందొకటి కవివంశానువర్ణనము. అది యీ పుస్తకమునందు లేదు, కవి చోడబల్లి యని తనతండ్రి నొక్కనిని జెప్పుటయే కాని తత్పూర్వుల నెవరినిఁ బేర్కొనలేదు. చోళులచరిత్రమునందు చోడబల్లు లెందఱో కనఁబడుచున్నారు. వారిలో నీతని తండ్రి యెవ్వరో యీ పుస్తకమువలనఁ దెలియదు. రెండవది కృతిపతివంశ వర్ణనము, అదియు