207
న న్నె చో డ క వి
నని యీకవి తన కుమారసంభవములో నీక్రిందిపద్యమునఁ జెప్పకొని యున్నాడు :
సీ. కుతలంబు నడుకొనఁ గొలకొండగా నిల్పి
శరనిధి గ్రొచ్చిరి సగరసుతులు
మిన్నులపైC బాఱుచున్నయే ఱిలఁ దెచ్చి
వారాశి నించె భగీరధుండు
గోత్రాచలము లెత్తికొని వచ్చి కడచన్న
రత్నాకరముఁగట్టె రాఘవుండు
జలధి మహీపతి మొలనూలుగాఁ జుట్టి
పాలించెఁ గరిఁగరికాలచోడు
గీ. వరుస నిట్లు సూర్యవంశాధిపతు లంబు
నిధియ మేర గాఁగ నిఖిల జగము
నేలి చనినవారి కెనవచ్చు సుశ్లాఘ
ధనుఁడ, నన్నెచోడ జనవిభుండ. [ ఆశ్వా.1-52 ]
దీనిక్రిందిపద్యములోనే తన తండ్రియైన చోడబల్లి పాకనాటి యం[1] దిరువది యొక్క వేయిటి కధీశుఁ డని కవియే చెప్పి యుండుటచేత నాతనికొడుకయిన నన్నెచోడుఁడును పాకనాటిలోఁ గొంతభాగమునకు ప్రభు వగుట స్పష్టము.
చ. 'అరినరపాలమౌళిదళితాంఘ్రియుగుం డయి పాకసూటియం
దిరువదియొక్కవేయిటి కధీశుఁడు నాఁ జను చోడబల్లికిం
జిరతరకీర్తి కగ్రమహిషీ తిలకం బన హైహయాన్వయాం
బరశశిరేఖ యైన గుణభాసిని శ్రీసతికిం దనూజుఁడన్.'
[ఆ.1-53]
ఈ పద్యముతరువాత నున్న యీక్రింద పద్యములోనే నొరయూరి
పురాధిపుఁ డన్న కథను జెప్పకొని యున్నాఁడు.
- ↑ [ ఇయ్యది జనసంఖ్య కాని, గ్రామసంఖ్య కాదని ఆంధ్రకవితరంగిణి' పుట 160)]