Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న న్నె చో డ క వి

[1]నన్నెచోడ దేవుఁ డనెడి యీ కవి తెలుఁగున కుమారసంభవ మనెడు పండ్రెండాశ్వాసముల కావ్యమును రచియించెను. ఈ గ్రంధములోని మొదటి యే డాశ్వాసములను 1909-వ సంవత్సరమునందు బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు మొదటిభాగము గాఁ బ్రకటించి యాంధ్ర ప్రపంచమునకు మహోపకారము చేసిరి. వారా పుస్తకము యొక్క పీఠికలో నీ కవి కవిత్వ ప్రౌఢిమనుబట్టి కవిరాజ శిఖామణియనియు, దిగ్విజయమును బట్టి టేంకణాదిత్యుఁ డనియు, బిరుదములు గలవాఁ డయ్యెననియు, కావేరీ తీరమున నొరయూరను పట్టణము రాజధానిగా గోదావరీ, సింహళ మధ్య దేశము నేలె ననియు, క్రీ. శ.940 లోఁ బాశ్చాత్యచాళుక్యులతో యుద్ధము చేసి రణరంగమున నిహతుఁ డయ్యెననియు వ్రాసిరి. ఈ కవి కవిరాజశిఖామణి యన్నపేరును తానే పెట్టుకొనెను. గ్రంథాదియందే యవతారికలో నున్న యిూ పద్యమును జూడుఁడు.

       చ. "రవికులశేఖరుండు కవిరాజశిఖామణి కావ్యకర్త స
           త్కవి భువి నన్నెచోడుఁడఁటె! కావ్యము దివ్యకథం గుమారసం
           భవమcటె ! సత్కథాధిపతి భప్యుఁడు జంగమమల్లికార్డునుం
           డవిచలితార్థయోగధరుఁడట్టె వినం గొనియాడఁ జాలదే


[ఆ-1-50]


                                                             

ఇతఁ డాత్మస్తుతియందు కొంచె మిష్టము గలవాఁడు. సూర్యవంశపురాజు లైన భగీరధుఁడు. రాఘవుఁడు మొదలయిన పూర్వులతోఁ దాను సమానుcడ

  1. కాలమునుబట్టి నన్నెచోడకవి తిక్కనాదులకంటె ముందు రావలసినవాఁడు. కాని శ్రీ వీరేళలింగము పంతులు గారు తొలుత గవిత్రయము యొక్కయుఁ, బిదప 11 వ శతాబ్దివాఁడని తాము భావించిన పావులూరి మల్లన యొక్కయు చరిత్రములను వివరించిన పిదపనే నన్నెచోడునిగూర్చి వ్రాయబ్రారంభించిరి. క్రమముతప్పక భారతకవుల చరిత్రమును దెల్పcదలఁచియే ఆయన తిక్కన,యెఱ్ఱనల చరిత్రములను ముందుగా జెప్పియుండవచ్చును.