ఈ పుట ఆమోదించబడ్డది
205
పా వు లూ రి మ ల్ల న
ఈ పావులూరిమల్లన భద్రాద్రిరామశతకమును కూడ రచియించినట్లు చెప్పుదురు గాని తండ్రులు వేఱగుటచేత భద్రాదిరామశతకమును రచియించిన పావులూరిమల్లన వేఱొకఁడని తోఁచుచున్నది. ఈ మల్లనతండ్రి పేరు సివ్వన్న; రెండవ పావులూరిమల్లన తండ్రి పేరు రామన్న యని శతకములోని యీ క్రింది పద్యమునందున్నది.
క. శ్రీమహితపావులూరిసు
ధాముఁడ రామన్నమంత్రి తనయుఁడఁ గవిసు
త్రాముఁడ మల్లనసచివుఁడ
శ్రీమద్భద్రాద్రి ధామ శ్రీరఘురామా!