Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

యనుసరించినను, భారతమున నూతన మార్గమును ద్రోక్కి గ్రంథాదిని తెలుఁగు పద్యమునే వేసి కవిస్తుతియు స్వప్న గాధ యు, షష్ట్యంతపద్యములును జేర్చినాఁడు. గతానుగతికులయి కవులందఱును బిమ్మటఁ దిక్కనచూపిన తోవనే నడుచుచున్నారు. పాపులూరి గణితము నందు మొదట నీ క్రింది శ్లోకమును, పద్యములును నున్నవి.

       శ్లో|| శ్రీకంఠం సగుణం సమస్త జగతాం కర్తార మీశం గురుమ్
            భూతో యానలచంద్రసూర్యపవనవ్యోమాత్మమూర్తిం విభుమ్
            నిత్యానందమయో పయో గిరిజయా సార్ధం ప్రజా వృద్దయే
            మాయా యోగ ముపైతి తం శివకరం వందే శివం శ్రేయసే.

       కం. ప్రణమిల్లి శివుని కీక్రియ
            నణిమాదిగుణాస్పదునకు నభినవస ఖ్యా
            మణిదీప్తి సారసంగ్రహ
            గణితసముద్రంబుఁ దఱియఁ గడఁగితిఁ బ్రీతిన్.

       శా. అర్కాదిగ్రహపంచకగ్రహణ కాలాన్వేషణోపాయమున్
            దర్కవ్యాకరణాగమాదిబహుశాస్త్ర ప్రోక్తనానార్ధసం
            పర్కాదివ్యవహారమున్ భువనరూపద్వీపవిస్తారమున్
            దర్కింపన్ గణిక ప్రవృత్తి వెలిగాఁ దార్కుం డెఱింగించునే?

       క. కావున గణితము దెనుఁగునఁ
           గావింపగ గణఁగితిన్సుకవిమల్లుఁడ గౌరీ
           వల్లభచరణ సరో
           జావాసితచిత్త మధుకరాత్ముఁడ జగతిన్.

ఈ ప్రకారముగా మొదట శ్లోకముతోఁ జేయఁబడిన పూర్వగ్రంథము లిప్పటికి నన్నయకృత భారతమును, భాస్కరరామాయణమును, నిర్వచనో త్తరరామాయణమును, ఈ పావులూరి గణితమును గనఁబడుచున్నవి. ఈ పుస్తకమునుండి శై_లిని జూపుట కొక పద్యము నుదాహరించుట దక్క గవినిగూర్చి వ్రాయదగిన దేదియుఁ గనుపట్టదు.