201
పావులూరి - మల్లన
చున్నాఁడు. ఈ కవి తనకు రాజనరేంద్రుఁడు పిఠాపుర సమీపమున నున్న నవఖండవాడ యను గ్రామము నిచ్చినట్లుగా నీ క్రింది పద్యములయందుc జెప్పకొన్నాఁడు:
ఉ. శ్రీనిలయండు శివ్వనను జిమ్మనను న్మఱి సూర్యదేవునిన్
ధీనిధిఁ బోలయార్యునిని దేజమున్ రవితుల్యు లై_న యా
సూనుల నల్వురం బడసె సూరిజనస్తుతసత్యధారతీ
జ్ఞాసులఁ బద్మ గర్భువదనంబులు నాలుగుఁబోల వారిలోన్.
ఉ. శ్రీలలనేశుఁడాంధ్రనృపశేఖరుఁడై చను రాజరాజభూ
పాలకుచేతఁ బీరపరిపార్శ్వమునన్ నవఖండవాడ యన్
ప్రోలు విభూతితోఁ బడసి భూరిజనస్తుతుఁడై న సత్కళా
శీలుఁడ రాజపూజితుఁడ శివ్వనపుత్రుఁడ మల్లనాఖ్యుఁడన్,
ఇందలి మొదటి పద్యము నప్పకవి తద్భవవ్యాజవిశ్రమమున కుదాహరణముగాఁ గై కొని యున్నాడు. దీనినిబట్టియే యితఁడు లాక్షణికకవి యని వేఱుగఁ జెప్ప నక్కఱలేకయే తెలిసికోవచ్చును. రాజనరేంద్రుని కాలము లోనే నన్నయభట్టు గాక యిట్టి కవిత్వమును జెప్పఁగల కవులితరులుండుటచేత నాంధ్రకవిత్వమునకు నన్నయభట్టారకుఁడు మొదటివాఁడు కాఁడనియు, అతనికాలమునందును నంతకుఁ బూర్వమునందుసు తెనుఁగు కవు లుండిరనియు వారట్టి కవిత్వముసు జెప్పటకుఁ గావలసిన లక్షణ గ్రంథము లా వఱ కే యుండిన వనియు, స్పష్ట మగుచున్నది. ఆ కాలమునందును, దత్పూర్వమునందును నుండిన తెనుఁగు కవులలోఁ దమ గ్రంథములందు మొట్టమొదట దేవతాస్తుతి నొక్క సంస్కృతశ్లోకములోఁ జేసి తరువాత దెనుఁగు పద్యముల నారంభించుట యాచారముగా సున్నట్లు కనఁబడుచున్నది. ఆ కాలమున గ్రంధములోఁ గవిస్తుతిని జేయుట లేదు; కృతిపతిని గూర్చి షష్ఠ్యంత పద్యములను జెప్పుట లేదు. ఈ యాచారము తిక్కనకాలమువఱకును వచ్చినది. తిక్కన తన నిర్వచనోత్తరరామాయణములోఁ బూర్వుల పద్ధతినే