ఈ పుట ఆమోదించబడ్డది
199
ఎ ఱ్ఱా ప్రె గ డ
భారతమును తెనిగించిన కవుల నిట్లు వరుసగాఁ జెప్పుటచేత నవ్నయ భట్టారకునికిని, ఎఱ్ఱాప్రెగడకును మధ్యకాలమునందు తెలుఁగు కవులెవ్వరును లేరని భ్రమింపఁగూడదు. ఆధర్వణాచార్యుఁడు, భీమకవి, రంగనాధుడు, భాస్కరుఁడు, కేతన, మారన, పెద్దన మొదలయినవారీ మధ్య కాలములో ననేకు లున్నారు*[1]. వారివి గుఱించి కూడ సంగ్రహముగా నికమీఁద వ్రాయుచున్నాను.
- ↑ ఎఱ్ఱాప్రెగడ తన నృసింహపురాణమునందు సహితము నన్నయాతిక్కనలనే పూర్వకవులనుగా జెప్పి యున్నాఁడు---
ఉ. భాసురభార తార్థమూలభంగుల నిక్క మెఱుంగ నేరమిన్
గాసట బీసటే చదివి గాధలఁ ద్రవ్వు తెనుంగువారికిన్
వ్యాసముని ప్రణీతపరమార్థము తెల్లఁగఁ జేసినట్టి య
జ్ఞాసనకల్పులం దలతు నాద్యుల నన్నయతిక్క నార్యులన్' (పీఠిక-9)
- (వీరి పౌర్వాపర్యముం గూర్చి యాయా సందర్భములందు వివరింపబడును.)