పుట:Aandhrakavula-charitramu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అరణ్యపర్వము సమగ్రముగా నుండుటచేతనే తిక్కనయు, మారనయు భారతమున మూఁడు పర్వములను నన్నయభట్టు రచించెనని చెప్పియున్నారనియు నిటీవలఁ గొందఱు తలంచుచున్నారు.రెడ్డిరాజుల యాశ్రయము లభింపక పూర్వమే భారతారణ్యపర్వము పూరింపఁబడుటచే, దాని నెఱిగియే తిక్కన మూఁడు పర్వములు నన్నయ కృతములని చెప్పుటయు, తాను విరాటపర్వమునుండి తెలిఁగింపఁ బ్రారంభించుటయుఁ గుదురదు. ఎంత ప్రయత్నించినను, తిక్కన గతించిన నాఁటి కెఱ్ఱాప్రెగడ జన్మించెనని చెప్పుటకును ప్రబల ప్రమాణములు లభించుట కష్టము]

ఈ కవి రచించిన భారతపద్యము లీ వఱకే యుదాహరింపఁబడి యున్నందున, తక్కిన పుస్తకముల శైలికూడఁ దెలియుటకయి వానినుండి కూడ రెండేసి పద్యముల నుదాహరించుచున్నాను


                       ఎఱ్ఱాప్రెగడ రామాయణము

      మ. చెఱకు౦దోటఁలఁ బెంచి శాలిమయసుక్షేత్రస్థలు ల్నించి య
           క్కఱ లేకుండc బూగనాగ లతికాకారతారము ల్ప్రోచి యే
           డ్తెఱ నంతం గుముదోత్పలాళి వనపాటికోటిఁ బాటించి పై
           న్జెఱువు ల్వొల్చెఁ బురంబునల్దెసలఁ నలఁ బ్రస్ఫీతాంబుపూర్ణస్థితిన్."

       ఉ. కోఱలు నుగ్గు నుగ్గయిన క్రూరఫణీంద్రుగతిం దరంగముల్
           మాఱిన భూరివారిధిక్రమంబున రాహుకరాళ వక్త్రమున్
           దూఱిన తీవ్రభాను క్రియ దుర్బలనైన్యతఁ బుత్రహీనతన్
           గీఱి పరాభవాదిగతిఁ గీడ్పడి భూపతి నెమ్మనంబునన్.

                           హరివంశము

       ఉ. ఏ నిటు ప్రాణరక్షకయి యెంతయుఁ బాపము చేసి గర్భసం
           తానవిఘాతినై విను నుదంచితశోకపయోధి ముంచితిం