పుట:Aandhrakavula-charitramu.pdf/223

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

196

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

అనపోతారెడ్డికి ప్రబంధముల నొసగిన యాతఁడు వెన్నెలకంటి సూర్యుఁడు. ఈ సూర్యకవి యనపోతనయాస్థానమునం దుండి ప్రబంధములు చేయుటయే కాక యనపోతని తండ్రి యైన వేమారెడ్డిచేత నగ్రహారములు పడసినట్లు జక్కన విక్రమార్కచరిత్రములోని యీ క్రింది పద్యము తెలుపుచున్నది.

ఉ. "వెన్నెలకంటిసూర్యుఁడు వివేకగుణాఢ్యుఁడు వేదశాస్త్రసం
     పన్నుఁడు రెడ్డివేమనరపాలకుచేత మహాగ్రహారముల్
     గన్న కవీంద్రకుంజరుఁ డకుంఠితతేజుఁడు పెద్దతండ్రిగా
     సన్నుతి గన్న సిద్దనకు సంతతదానకళావినోదికిన్.

పోలయవేమారెడ్డి యవసానదినములయందు వెన్నెలకంటి సూర్యుఁడు తదాస్థానకవిగా నుండి యగ్రహారములను బొందుట మొదలయిన వానినిబట్టి విచారింపఁగా నెఱ్ఱాప్రెగడ వేమారెడ్డికాలములోనే పరమపదము నొందెనేమో యని యూహ కలుగుచున్నది. యెఱ్ఱాప్రెగడ యనవేమారెడ్డి నెఱుఁగకపోవుట కూడ నీ యూహను బలపఱుచుచున్నది. ఎఱ్ఱాప్రెగ్గడకు ముఖ్యాశ్రయుఁడును, అన్న యైన వేమారెడ్డి కీకవి నిచ్చినవాఁడును, అయిన మల్లదండనాధుఁడు గూడ వేమారెడ్డి కాలములోనే లోకాంతరగతుఁ డయ్యెను. తమ్ముని మరణానంతరమున వేమారెడ్డి తన ప్రియానుజన్ముఁడైన మల్లారెడ్డికి పుణ్యముగా నమరావతీ పట్టణములోని యమరేశ్వరాలయశిఖరమున స్వర్ణకలశముల నెత్తించెను. ఎఱ్ఱాప్రెగడజననమరణకాలములను గూర్చి పైని వ్రాయబడినవి సంభావ్యము లైన యూహలే కాని సరిగా నిర్ధారితములైన పరమ సిద్ధాంతములు కావు. [భారతా రణ్య పర్వశేష, నృసింహ పురాణ, రామాయణ, హరివంశములనేగాక యెఱ్ఱాప్రెగడ "కవి సర్పగారుడ" మను ఛందో గ్రంధమును వ్రాసినట్టు ఆనంద రంగరాట్ఛందమునం దుదాహృతములైన పద్యములను బట్టితెలియుచున్నది, కాకొని యట్లూహించుటకుఁ దగిన ప్రమాణములు లేవు.

ఎఱ్ఱాప్రెగడయును, తిక్కనయు సమకాలీనులనియు తిక్కన భారతమును రచింపఁ బూనుటకు ముందే ఎఱ్ఱాప్రెగడ '(నన్నయ) తద్రచనయకా' నరణ్యపర్వమును పూరించి, రాజరాజనరేంద్రుని కంకిత మిచ్చెననియు,