పుట:Aandhrakavula-charitramu.pdf/218

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వెలనాటిచోడుని కాలములో నున్న భీమనమంత్రికొడుకు బొల్లన; బొల్లన కొడుకెఱపోతన ఎఱపోతనయొక్క కొడుకు సూరన, సూరన కొడుకెఱ్ఱాప్రెగడ. వెలనాటిచోడునికాలమునం దుండి భీమన మంత్రికిని కవియైన యెఱ్ఱాప్రెగడకును నడుమ ముగ్గురు పురుషులున్నారు. ఒక్కొక్క పురుషునికిఁ గలయంతరము నలువదేసి సంవత్సరముల చొప్పున గణించినను భీమనమంత్రి తరువాత నెఱ్ఱాప్రెగడ నూట యిరువది సం త్సరములకు పుట్టియుండ వలెను. వెలనాటిచోడుఁడు 1151 మొదలుకొని 1163 వ సంవత్సరము వఱకును భూపరిపాలనము చేసెను. అతనిచే మన్నన గన్న భీమనయు నా కాలమునం దుండవలెను; ఒక్కొక్కcడు తండ్రికి నలువదేసి సంవత్సరముల యీడునఁ బుట్టుచు వచ్చినచో భీమనకొడుకు బొల్లన 1196 వ సంవత్సరమునఁ బుట్టి యుండవలెను. తరవాత నాతని కొడు కెఱపోతన 1236-వ సంవత్సరమున బుట్టి యుండవలెను; అటుపిమ్మట నాతని కొడుకు సూరన 1276 వ సంవత్సరమునందుc బుట్టి యుండవలెను; పిదప సూరనకొడుకు మనకవి యెఱ్ఱాప్రెగడ 1316 వ సంవత్సరము నందు c బుట్టి యుండవలెను. వెలనాటిచోడునివలన మిగుల మన్ననc బొందిన భీమనమంత్రి వెలనాటిచోడునికాలమునాఁటికే ముప్పది నలువది యేండ్ల ప్రాయముగలవాఁడయి యుండును గాన నాతనిపుత్రుని జననమున కటు తరవాత నలువదియేండ్లు వేయుట న్యాయము కాదు. అందుచేత నిరువ దేసి సంవత్సరములు తగ్గించుచు వచ్చినచో మనకవి జననకాలము 1396 వ