181
ఎ ఱ్ఱా ప్రె గ డ
కును రాజ్యముచేసినందున. ఇతని యాస్థానకవీశ్వరుఁడయిన యెఱ్ఱాప్రెగడ యిప్పటి కయిదువందలయేబది సంవత్సరముల క్రిందట నున్నట్లు నిశ్చయింపవలసి యున్నది. పోలయవేమారెడ్డిపూర్వు లంత పేరుపడినవారు కారు గనుకనే యెఱ్ఱాప్రెగడ హరివంశమునందు పోలయ పయివారి నెవ్వరిని వంశవర్ణనయం దుదాహరింపలేదు. పోలయవేమారెడ్డి కద్దంకి రాజధాని యయినట్టు హరివంశములోవి యీ క్రిందిపద్యమువలన విశద మగుచువ్నది.
గీ. "తనకు నద్దంకి తగు రాజధానిగాఁ బ
రాక్రమంబున ది బహుభూము లాక్రమించి
యనుజతనుజబాంధవమిత్రజనుల కిచ్చె
నెదురెె యెవ్వారు వేమమహీశ్వరునకు."
ఎఱ్ఱాప్రెగడ హరివంశమునందీ క్రిందివద్యములచేత నన్నయ తిక్కన సోమయాజుల నిద్దఱిిని మాత్రమే పూర్వకవులనుగా స్తుతించినాఁడు.
ఉ "ఉన్నత గోత్రసంభవము నూర్జితసత్వము భద్రజాతి సం
పన్నము నుద్దతాన్యపరిథావి మదోత్కటము న్నరేంద్రపూ
జోన్నయనోచితంబు నయి యొప్పెడు నన్నయభట్టకుంజరం
బెన్న నిరంకుశోక్తిగతి నెందును గ్రాలుటఁ బ్రస్తుతించెదన్."
మ. తనకావించినసృష్టి తక్కొరులచేతం గాదునా నే ముఖం
బునఁ దాఁ బల్కిన పల్కు లాగమములై పొల్పొందునా వాణి
నత్తను వీతం డొకరుండునాఁ జను మహత్త్వా ప్తిం గవిబ్రహ్మనా
వినుతింతుం గవితిక్కయజ్వ నఖిలోర్వీదేవతాభ్యర్చితున్.
ఇతడు హరివంశమును రచియించుటకుముందే రామాయణమును రచించి నట్లు వేమారెడ్డి కవి నుద్దేశించి యన్నట్లు చెప్పఁబడిన యీ క్రింది పద్యము వలనఁ దెలియవచ్చుచున్నది.
శా. "నా తమ్ముండు ఘనుండు మల్లరథినీనాధుండు ని న్నాతత
శ్రీతోడ న్సముపేతుఁ జేసి యెలమి జేపట్టి మా కిచ్చుటం