180
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
"హరివంశకృతిపతి వేమా రెడ్డి కాదనియు, నాతని మూడవ కుమారుఁడైన యనవేమారెడ్డి యనియు గొంందఱు భ్రమపడుచున్నారు ... ఆశ్వాసాంత పద్యములను బట్టి హరివంశకృతిపతి కోమటి ప్రోలయ వేముఁడు కాని వేమారెడ్డి కుమారుఁడైన యనవేమారెడ్డి కాఁడని నిశ్చయము"] అనవేమారెడ్డితండ్రి యైన యీ పోలయవేమారెడ్డి ప్రతాపరుద్రుని ప్రభుత్వ దినములలో నొక సేనానాయకుడుగా నుండి 1323 వ సంవత్సరమున ప్రతాపరుద్రుడు తరుష్కులచేత కారాగారబద్ధుఁడుగాఁ జేయఁబడిన కొన్నిసంవత్సరముల కనఁగా 1328 వ సంవత్సరమునందు స్వతంత్రుఁడయి వినుకొండరాజ్యము నాక్రమించుకొని 1349 వ సంవత్సరమువఱకును రాజ్యముచేసెనని చెప్పఁబడియున్నది. కొని యీతని శాసనములు 1320 వ సంవత్సరమునుండియే కానcబడు చున్నందున నితఁ డా సంవత్సరమునందే రాజ్యపాలన మారంభించి యుండుసు. అందుచేత నీ పోలయవేమారెడ్డి [1]1320 వ సంవత్సరము మొదలుకొని 1349 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసి యుండవలెను, ఇతఁడు మొదట సామంతుఁ డయి కాకతీయ రాజ్యావసానదశ యందు స్వతంత్రరాజయి యుండును. ఈతని ప్రధమపుత్రుఁడు ఆనపోతారెడ్డి 1350 వ సంవత్సరము మొదలుకొని 1361 వ సంవత్సరమువఱకును, ద్వితీయపుత్రుఁడు సుప్రసిద్ధుడై న యన వేమారెడ్డి 1363 మొదలుకొని 1380 వఱకును రాజ్యముచేసిరి. ఈ యనవేమారెడ్డి రాజమహేంద్రవరమువఱకును తెనుఁగు దేశమును జయించి ప్రసిద్ధికెక్కుటయే కాక, సంస్కృతాంధ్రములయం దసమానపాండిత్యముకలవాఁడయి యమరుక కావ్యమునకు సంస్కృతవ్యాఖ్య వ్రాసి ప్రఖ్యాతి కెక్కెను. [అమరుకకావ్యమునకు సంస్కృతవ్యాఖ్యానమగు "శృంగారదీపిక"ను రచించిన యాతఁ డీ యనవేమారెడ్డి కాఁడు. పెదకోమటి వేమారెడ్డి.ఇతడు క్రీ.శ.1400-1420 నడుమ నుండెను] పోలయవేమారెడ్డి 1320 వ సంవత్సరము మొదలుకొని 1349 సంవత్సరమువఱ
- ↑ [ఇతని రాజ్యారంభ కాలము 1324 అని 'ఆంధ్ర కవితరంగిణి' (సంపుటము '4 ఫుట 57]