పుట:Aandhrakavula-charitramu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

179

ఎ ఱ్ఱా ప్రె గ డ

        ఉ. నారలు కట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులో విప
            ద్భారము నొంది వందరినఫల్గును నుజ్జ్వలరాజ్యవైభవో
            దారుల మై కనుంగొని ముదంబును బొందఁగ గాంచుకంటెనిం
            పారఁగ వొండుగల్గునె కృతార్థత యెందును గౌరవేశ్వరా.
                                                   ఆర.ప. ఆ.5
        ఉ. శాతవశాఖాగ్రఖండితలసన్మదకుంజర కుంభముక్తము
            క్తాతతశైలకందరగుహాంతరసుప్తమృగేంద్ర కేసర
            వ్రాతము వేడ్క. నాచికొన నారక చేరుట గాదె క్రోధవి
            ర్ఘాతమహోగ్రు భీము జెనకం దలపోయంట నీకు నెమ్మెయిన్.'
                                                   ఆర. ఆ. 6

భారతము రచించిన యీ ముగ్గురు కవులునుప్రామాణికాగ్రగణ్యులు. నర్వవిధములచేతను వీరి కవిత్వము మిక్కిలి శ్లాఘ్యమైనది. వీరిని కవిత్రయ మందురు. కవిత్రయ విరచిత మయిన యాంధ్రభారత మారంభింపఁబడిన మూఁడు వందలసంవత్సరములకు సంపూర్ణ మైనది. కవిత్రయము ప్రయోగించిన పదములనే కాని వేఱు పదములను కవులు ప్రయోగింప గూడదని వీరికి వెనుక కవిరాక్షసుడను నతఁడు తాను రచియిం చిన కవిరాక్ష సీయ మను లక్షణ గ్రంథము నందు నియమము చేసినాఁడట. అయినను తరువాతి కవులు మాత్ర మీ నియమము నంతగా పాటింపలేదు.

ఎఱ్ఱాప్రెగడ శివభక్తుఁడగుటచేత శంభుదాసుఁ డనియు, ప్రబంధ ధోరణిని భారతారణ్యపర్వశేషమును చమత్కారబంధురముగా రచించుటచేత ప్రబంధ పరమేశ్వరుఁ డనియు, బిరుదనామములు గలవు. ఈతఁడు చేసిన యితర గ్రంథములు రామాయణము, హరివంశము, *[1] లక్ష్మీనృసింహ పురాణము. ఇందలి కడపటి పుస్తకమున కహోబిలమహాత్మ్య మని నామాంతరము.

హరివంశ మీ కవి కొండవీటి ప్రభువైన *[2] పోలయవేమారెడ్డి కంకితముచేసెను. ఇయ్యెడ "ఆంధ్రకవి తరంగిణి'(నాలుగవ సంపుటము-పుట 97)లో నిట్లున్నది.

  1. లక్ష్మీనృసింహావతారమను పేరు శబ్దరత్నాకరమునఁ గలదు.
  2. 'పోలయ'కు బదులు 'ప్రోలయ' అని యంతట నుండఁదగును.