Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

172

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

      క. పాండవులవలనఁ గీడొ
           క్కొండను లే దధిప నీదు కొడుకులు ధరణీ
           మండల మంతయు మ్రింగిరి
           పాండునృపతిభాగమునకుఁ బాపిరి వారిన్

ఒక్కొఁ డని వాడియున్నాఁడు. నన్నయ తిక్కనాదుల ప్రయోగములను మనము శిరసావహించి గ్రహింపవలసినదే యయినను మన గ్రంధముల యందు "అందొఱు" "ఒక్కొఁడు" మొదలయిన విశేష రూపములను వాడక 'అందఱు' 'ఒక్కఁడు' మొదలయిన సామాన్యరూపములనువాడుటయే మంచిదని నేననుకొనియెదను.

తిక్కనసోమయాజులు మనుమసిద్దిరాజ్య మంతరించిన తరువాత చిరకాలము జీవించి యున్న వాఁడయి సర్వజనులచే గౌరవింపఁబడుచు నుండినవాఁడే యయినను మరణకాలమునకు విశేషవిత్తవంతుఁడుగా నుండినట్టు కనఁబడఁడు. అందుచేతనే యాతని కుమారుఁడు కొమ్మన్న పాటూరికరణికమును సంపాదింపవలసినవాఁ డయ్యెను.

రక్కస గంగరనదేవమహారాజు రాజ్యమేలుచుండఁగా 1169 శాలివాహన శకము ఫ్లవంగసంవత్సర జ్యేష్ట శుద్ద త్రయోదశీ శనివార మనఁగా క్రీస్తు శకము 1247-వ సంవత్సరములో చెంటిరామనాయకుఁడు కడప మండలము లోని సిద్ధవటముతాలూకా జోతిగ్రామమునందలి జ్యోతినాధ దేవాలయము నకు గోపురము కట్టించినట్లు దాని యావరణములో ఱాతిమీద (No.568) శాసన మొకటి చెక్కcబడియున్నది. నిర్వచనోత్తరరామాయణములో "రంగదుదారకీర్తి యగు రక్కెస గంగని" యన్న పద్యముండుటచేత, ఈ శిలా శాసనమునుబట్టి 1247-వ సంవత్సరము నకు పెక్కేండ్లు తర్వాతనే నిర్వచనోత్తరరామాయణము రచియింపఁబడినట్టు స్పష్ట మగుచున్నది. [రక్కెస గంగనయు, గంగయసాహిణియు నభిన్నవ్యక్తులని శ్రీ చిలుకూరి వీరభద్రరావుగా రభిప్రాయపడినారు. నిర్వచనోత్తరరామాయణములోని "రంగదుదారకీర్తి —"అను పద్యమునుబట్టి వారిర్వురును విభిన్నవ్యక్తు