పుట:Aandhrakavula-charitramu.pdf/198

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

171

తి క్క న సో మ యా జి

పయివావిలో 'మదనవశీకారమంత్ర దేవత" యను సీసపద్యమును కుమార సంభవటిప్పణములో విజయసేనము ద్వితీయశ్వాసములోనిదని మానవిల్లి రామకృష్ణకవిగా రుదాహరించి యున్నారు [1]

నన్నయభట్టారకుఁడును తిక్కనసోమయాజియు నాంధ్రకవులలోఁ బ్రామాణికాగ్రగణ్యులే యయినను మనము వారి పుస్తకములోని సామాన్యప్రయోగములను మాత్రమే యను పరింపవలయును గాని యతులకొఱకును ప్రాసములకొఅకును వారు వేసికొనవలసివచ్చిన యసామాన్య ప్రయోగములను మన మనుసరించుట యుచితము కాదని నేను దలఁచుచున్నాను. ఎట్లన నన్నయభట్టు సామాన్యముగా నందఱనియే ప్రయోగించుచు వచ్చినను నొకటి రెండు స్థలములయందు యతి స్థలమున

     గీ. గురులలోనఁ బరమగురువు తల్లియ యట్టి
        తల్లివచనమును విధాతకృతియు
        నన్యధాకరింప నలవియే యనిని నం
        దొఱకు నిట్టు లనియె ద్రుపదవిభుఁడు.

అందొ ఱని వాడి యున్నాఁడు. ఈ ప్రకారముగానే తిక్కనసోమయాజి సామాన్యముగా నొక్కఁడనియే ప్రయోగించుచును వచ్చిన యతి సానమునందొకచోట

  1. [పెదపాటి జగ్గకవి తాను సమకూర్చిన 'ప్రబంధ రత్నాకరము'లో 'విజయసేనము' లోని పద్యముల నుదాహరించి యున్నాఁడు. 'విజయసేనము' లభ్యముకాలేదు. ఇయ్యది తిక్కనకవి కృతమనుటలో ఆధారములు లేవు. అప్పకవి, కస్తూరి రంగ కవి 'విజయసేనము' లోని దని యుదాహరించిన పద్యమును కూచిమంచి తిమ్మకవి చిమ్మపూడి అమరేశ్వరుని 'విక్రమసేనము' లోనిదిగా నుదాహరించెను. దీనింబట్టి విక్రమ సేన, విజయసేనములను జెప్పటలో తార్మాఱు జరుగుచున్నట్లు తెలియుచున్నది. 'విజయసేనము' లోనివని యుదాహరింపఁబడిన పద్యములు వైశ్యవర్ణనము,గణపతి స్తోత్రము, పరిఖావర్ణనము మున్నగు విషయములు కలవి కలవు. వీని కర్తృత్వమును గూర్చి విమర్శకులు సందేహించు చున్నారు]