169
తి క్క న సో మ యా జి
ఇతఁడు కృష్ణశతక మొకటి చెప్పెనని వేంకటరంగకవి యీ పద్యము నుదాహరించుచున్నాడు.
మ. అరయన్ శంతనపుత్రుపై విదురుపై నక్రూరుపైఁ గుబ్జపై
నరుపై ద్రౌపదిపైఁ గుచేలునిపయిన్ నందవ్రజ శ్రేణిపైఁ
బరఁగంగల్గుభవత్కృపారసము నాపైఁగొంత రానిమ్ము నీ
చరణాబ్జంబులు నమ్మినాను జగదీశా కృష్ణ భ_క్తప్రియా! [1]
తిక్కనసోమయాజి 'విజయ సేన" మను - గ్రంధమును గూడ రచించెనని కొందఱు వ్రాయుచున్నారు. నే నా గ్రంథమును జూడకపోవుటచేత తిక్కనయే దానిని రచించెనో, తిక్కనయే గ్రంధకర్త యైనచో నతఁ డే తిక్కనయో, నే నిప్పడు చెప్పఁజాలను. "విజయ సేన" మను పూర్వ గ్రంధ మొకటి యున్నది. దానినుండి యప్పకవి యీ క్రింది పద్యము నుదాహరించియున్నాcడు.
ఉ.'వల్లభుcడేగు దుర్లభుఁడు వాని దెెసం దగులూది యిమ్మెయిన్
దల్లడమందె దేల యుచితిస్థితికి న్ననుఁదావఁజూచినన్
దల్లియు బంధులోకమును దండ్రియు నేమనువా రెఱెం గిరే
నుల్లమ! ఇట్లు నీకుఁదగునో తగదో పరికించి చూడుమా!'
చిలుకూరి వీరభద్రరావుగా రాంధ్రుల చరిత్రము నందీ క్రింది పద్యముల నుదాహరిం చియున్నారు.
సీ. 'ఘనసార కస్తూరికాగంధముల నవ్య
గంధబంధంబులు గఱపి కఱపి
- ↑ [కృష్ణ ! భక్తప్రియా !!అను మకుటముతో శతకమున్నట్లు కానరాదని ' ఆంధ్రకవి తరంగిణి'(ద్వితీయ సంపుటము పుట 185 లోఁ గలదు. కృష్ణా ! దేవకీనందనా ! అను మకుటముతో మాత్రము వెన్నలకంటి జన్నయ కృతమగు శతకము కానవచ్చుచున్నది. అది దేవకీనందన శతకముగా ప్రసిద్ధము