పుట:Aandhrakavula-charitramu.pdf/186

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

159

తి క్క న సో మ యా జి

చేయించి తిక్కనను వాద్యములతో నూరేగించి యూరి వెలుపట వేయించిన యజ్ఞశాలయందు ప్రవేశపెట్టి యాతనిచేతను యజ్ఞముచేయించి పురోడాశము తినిపించె ననియు, అట్లు చేసినను రాజుమీద కోపము పూర్ణముగా తీఱక తిక్కన తన భారతము నా రాజునకుఁ గృతియియ్యక నెల్లూరియందున్న హరిహరనాథ దేవుని కంకితము చేసెననియు చెప్పదురు. హరిహరనాధుని గుడి నెల్లూరియందిప్పుడు శిథిలమయిపోయినదcట! పయి కథ యెట్టి దయినను, తిక్కన నిర్వచనోత్తరరామాయణము చేయునప్పటికి యజ్ఞము చేయుకుండుటయు, భారతమును రచించునప్పటికి యజ్ఞముచేసి యుండుటయు మాత్రము సత్యము. దీని సత్యమును 'బుధారాధన విధేయ తిక్కననామధేయప్రణితంబై న' యను నిర్వచనోత్తరరామాయణమునందలి గద్యమును బట్టియు 'బుధారాధనవిరాజి తిక్కనసోమయాజి ప్రణీతం బయిన" యను భారతమునందలి గద్యమునుబట్టియు స్థాపింపవచ్చును. మిగిలిన యీ కథాంశమునం దేమాత్రము సత్యమున్నను తిక్కనసోమయాజి విరాటపర్వము యొక్క పీఠికయందే వ్రాసియుండుసు. ఆ పీఠికయందు రాజనరేంద్రుని పేరైన నె త్తఁబడి యుండక పోవుటయే తిక్కన రాజనరేంద్రుని కాలము వాడు కాఁడనుటను సిద్ధాంతీకరించుచున్నది.

తిక్కనసోమయాజి యూ భారతమును జెప్పునప్పడు దీనిని ప్రాయుటకయి నిర్ణయింపఁబడినవాఁడు * కుమ్మరగురునాధుఁడని చెప్పదురు. ఆతనికి చెప్పిన ___________________________________________________ *కుమ్మర గురునాథుఁడు తిక్కన సోమయాజితండ్రియైన కొమ్మనామాత్యునకే పుట్టెననియు, కొమ్మనామాత్యుఁడు గర్భాధానార్థము మంచిముహూర్తము పెట్టుకొని తన యత్తవారింటికి బోవచుండఁగా నాకస్మికముగా పెన్న పొంగి నది దాటుటకు శక్యము గాక తడుగుపాడను గ్రామసమీపమున నిలచిపోవలసి వచ్చెననియు, అప్పుడా గ్రామమునందున్న కుంభకారు డొకడాతని ప్రార్ధించి తనయింటికి గొనిపోయి యాదరించి యా సుముహూర్తమునందు సంపూర్ణయౌవనవతియు ఋతుస్నాతయు నయి యున్న తన కుమార్తెకు పుత్రదానము చేయవలెనని వేడుకొనె ననియు, అతఁడు వాని ప్రార్థన ను త్రోచి చేయలేక యంగీకరించి యా రాత్రి యా కులాలయువతితో సంభోగింపఁ గా గురునాథుఁడను పుత్రుడు కలిగెననియు ఒక కథ చెప్పదురు. అది యెంతవఱకు నమ్మఁదగియుండునో దీనిని జదివెడువారే నిశ్చయించుకోవలెను.