155
తి క్క న సో మ యా జి
వచ్చినచో భారతమును రచింపకయే యుండి యుండవలెను. మరణమును జెప్పట కిష్టము లేకుండుటయు భయపడుటయు కొందఱి విషయముననే యుండును. ఏదియు లేకపోయినయెడల భారతమును రచించునంతటి దీర్ఘ కాలము జీవించియుండియు తిక్క_న డాని నేల ముగించి యుండఁడు ? తిక్కన సంపూర్ణముగానే రచించెననియు, తరువాత నా భాగముత్సన్న మయ్యెననియు నొకరు చెప్పుచున్నారు. ఈ యత్సన్నకధ మనవారికి ప్రతివిషయమునందును చక్కఁగా తోడుపడుచున్నది. తరువాతఁ గొంత కాలమునకు మిగిలిన భాగము నేకాశ్వాసముగా రచియించిన జయంతి రామభట్టు తిక్కన సోమయాజి మనుమరాజున కిచ్చినట్టుగా నరాంకితము చేయక తాను జేసిన కడపటి యాశ్వాసమును శ్రీ భద్రాద్రిరామున కంకితము చేసెను. తాను రచించిన యేకాదశాశ్వాసమున రామభట్టీక్రింది పద్యమును జెప్పి యన్నాడు.
ఉ. "తిక్కనసోమయాజి మును తెల్గున నుత్తరకాండ చెప్పి యం
దొక్కటి చెప్పఁ డయ్యెఁ గడు నొద్దిక నే రచియింప వేడ్కచే
నిక్కము సంస్కృతంబు విని నెమ్మది భక్తిని నే రచించితిన్
జక్కని దేవళంబు తుద స్వర్ణ ఘటం బిడుపోల్కి దోఁపఁగన్."
నిర్వచనోత్తరరామాయణముయొక్క శైలిని గనఁబఱుచుట కయి రెండు పద్యము లిందు క్రిందఁ బొందుపఱచుచున్నాను :
శా. మాలిం జంపిన మాల్యవంతుఁ డుదితామర్ష ప్రకర్షంబునం
గాలాగ్ని ప్రతి మానుఁడై నిజభుజాగర్వంబు మై లీల ను
న్మీలజ్ఞ్వాలకరాళశక్తిఁ గొని మే మే దాఁకి వక్షస్థలిన్
గీలించెన్ జలదంబుపై మెఱుఁగుమాడ్కిన్ శారికింజెన్నుగాన్.
ఆ.3
చ. ఎఱుఁగవుగాక భోగముల కెల్లను నెచ్చెలి జవ్వనంబ యి
త్తఱి నుడి వోవకుండ నుచితంబుగ జక్కవదోయిఁబోని క్రి
క్కిఱిసిన చిన్ని చన్నుఁగవ యిం పెసలారఁగ నాదువక్ష మ
న్వఱలు సరోవరంబున నవారణఁ గేళి యొకర్పు కోమలీ !
ఆశ్వాసము 5