1.పెదపాటి సోమనాథుడు. ఈతని నే కవిలోక బ్రహ్మయందురు. ఇతcడరుణాచల పురాణము, శివజ్ఞానదీపిక, కేదారఖండము మొదలగు గ్రంథములను జేసెను.
అరుణాచల పురాణములో "వాక్ప్రతోషితదక్షవాటీమహాస్థాన భీమువేములవాడ భీము" ఆని భీమకవిని స్తుతించియుండుటచేత నాతని తరువాత నుండిన వాఁడు
ఉ. రాజులు విక్రమోగ్రమృగరాజులు విశ్రుతదివ్యకాంతి రే
రాజులు రూపు రేఖ రతి రాజులు మనగుణంబునందు రా
రాజులు దానశక్తి ధనరాజులు వైభవభోగవృద్ధి స్వా
రాజులనంగ నొప్పుదురు రాజితతేజులు తత్పురంబునన్.
అరుణాచల పురాణము
ఉ. కన్నియ రూపు గోరుఁ గనకంబును గోరునుదల్లి బుద్ధి సం
పన్నతఁ గోరుఁ దండ్రి కులభవ్యత గోరు బంధుకోటి ప
క్వాన్నఫలాదిభక్షణము లన్యులు గోరుదురిట్టు లిన్ని యుం
బన్నుగనొక్కచో నొదవె భాగ్యము చేసితిఁ గన్య నిచ్చెదన్.
కేదారఖండము
2. సూరన్న -- ఇతఁడు వనమాలీవిలాసము, ఉదయనోదయము,
అనుగ్రంథము లను రచించెను
ఉ. ఆతడి రాజమంచనివహాంచలవీధుల కేగుదెంచున
బ్జాతదళాక్షిఁబల్కె నటుచంద్రనిభానన దాదిపట్టి వి
జ్ఞాత సమస్తభూరమణజాతగుణాన్వయ వేత్రదండమున్
జేతఁ దెమల్చి మోపు జనసింధురవం బెడలించె వేడ్కతోన్ -వన.
చ.సరభసలీలఁ గేళిసితసౌథము లొక్కట నిర్గమించి చ
ల్లిరి నర సాధువిూఁదఁ బురిలేమలు లాజలు దోయిలించి చె
చ్చెర శరదంబువాహములు చించి బయల్పడుచంచలాలతల్
పరిమితదృష్టి బిందువులఁ బర్వతరాజముఁ గప్పునాకృతిన్
ఉదయనోదయము
3. పొన్నాడ పెద్దన్న - ఇతడు ప్రద్యుమ్న చరిత్రమును రచించెను.