Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

143

తి క్క న సో మ యా జి

ముల కాఱునూఱు సంవత్సరములు లెక్క వేసినను తిక్కనసోమయాజి కాలము 1300 ల సంవత్సరముకంటె వెనుకకు పోదు. ("ఆంధ్రకవి తరంగిణి" కారులు తిక్కనసోమయాజి చరిత్రములో కవి కాలమును గురించి విపులముగాఁ జర్చించి, యీ 'ఆంధ్రకవుల చరిత్రము" నందలి విషయము లను గూర్చి తమ యభిప్రాయమును తెల్పుచు తమ సిద్ధాంతమును వివరించిరి. దాని సారము మాత్ర మిచట తెలుపఁబడుచున్నది.

'బ్ర. శ్రీ వీరేశలింగము పంతులుగా రాంధ్రకవుల చరిత్రమునఁ దిక్కన కాలమును సరిగానే నిర్ణయించిరి కాని, వారు గైకొనిన యాధారములు సంశయాస్పదములుగా నున్నవి. వారాధారముగాఁ గైకొనిన పెంట్రాల శాసనములు మన మనుమసిద్దివి గావనియు, ముక్కంటికాడు సెట్టి వంశీయుఁడైన భుజ బల వీర మనుమసిద్ధివనియుఁ దోఁచుచున్నది. మనుమసిద్ది నామధారులు పెక్కురున్నారు. (రెండవ సంపుటము పుట 196)

'బ్ర. శ్రీ వీరేశలింగము పంతులుగారీ (పాటూరి శరభరాజుగా రిచ్చిన) వంశావళినిబట్టి తిక్కనకాలమును నిర్ణయించ యత్నించిరి. ఇప్పడు శాసన సాహాయ్యమున నీ మహాకవి కాలము స్పష్టముగాఁ దెలియుచున్నది. కావున నందుల కీ వంశావళితోఁ బనిలేదు' (రెండవ సంపుటము పుట 155)

తిక్కన నిర్వచనో త్తర రామాయణమును కీ. శ. 1253–1258 నడుమ రచించి యుండుననియు ఇతఁడును, కృతిపతియగు మనుమసిద్దియు నించుమించుగ సమవయస్కులనియు, అప్పటికి తిక్కన వయస్సు నలువది సంవత్సరము లుండుననియు, నందుచే నీతని జననము క్రీ శ.1220 ప్రాంతమున నుండుననియు మనుమసిద్ధి నిర్యాణానంతరము భారతరచన ప్రారంభింపఁబడి యుండుననియు, ఆ రచన క్రీ శ. 1270-1280 ల నడుమ జరిగియుండుననియు నందు వివరింపఁబడియున్నది. తిక్క-న నిర్యాణమును గూర్చిన 'అంబర రవి శశి .... అను పద్యము ప్రమాణము కానందున, దానింబట్టి తిక్కన నిర్యాణకాలమును నిర్ణయించటం సరికాదని అందఱు నంగీకరింతురు. తిక్కన 78 ఏండ్లు జీవించియుండెనని వాడుక యున్నందున అతనికాలము క్రీ.శ. 1220 మొదలు 1300 వరకు నుండవచ్చునని యూహింపవచ్చును.)