Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బడవలసి యున్నారనియు,తెలుపుచు "మెయి"నెల రెండవ తేదీని వారు నాపేరవ్రాసిరి, "నేను వారిని పంపుఁడని కోరినవానిలో విక్రమసేనము, విజయసేనము, అథర్వభారతము, అథర్వ ఛందస్సు మొదలయినవాని యవతారికలు చేరి యున్నవి. వారు మఱునాఁడే పంపెదమన్నసమాచారమేహేతువుచేతనో నా కీవఱకును జేరనే లేదు. అట్లు చేరకపోవుట ప్రోషణ కార్యస్థానభటులలోపమువలన నయియుండును.క్రొత్తగా "నేను భోజరాజీయమును వరాహపురాణమునుముద్రింపఁబూనినప్పడు వాని ప్రత్యంతరములను గద్వాల సంస్థానమున సంపాదించి తెచ్చి నాకిచ్చి 1904 వ సంవత్సరమునకుఁ బూర్వమునందే నా కృతజ్ఞతకుఁ బాత్రు లైన పరమమిత్రులు శ్రీమానవల్లి రామకృష్ణయ్య గారు "నేను కోరిన పుస్తకము అప్పడు తమయొద్ద లేకుండుటచేతనే పంపలేకపోయియుందురు గాని నామీఁదియనాదరముచేతఁ బంపక యుండియుండరు వారు నాకియ్యఁదలఁచుకొన్న కపులనుగూర్చిన సమాచారము నిప్పుడిచ్చినను నేను దానిని కృతజ్ఞతాపూర్వకముగా నంగీకరించి దీని కనుబంధముగాఁ బ్రచురించెదను. ఆంధ్ర పరిషత్పుస్తక భాండాగారములోని యసమగ్రమైన యుదాహరణ పుస్తకమును నేను వ్రాయించి తెప్పించుట చేత నా కనేక పూర్వకవుల నామములను వారి గ్రంథనామములు ను దెలిసినవి. శ్రీరామకృష్ణకవిగారియొద్ద నున్న జగ్గనకృతమైన ప్రబంధరత్నాకరముకూడ లభించి యుండినయెడల నింకను "నెక్కువగాc బూర్వకవులపేరులును వారి గ్రంథముల-పేరులును నాకుఁ దెలిసియుండును. ఆ పుస్తకమునకుఁ బుత్రిక నైనను వ్రాయించి తెప్పించుకొనుట కయి నేను ప్రయత్నములు చేసియు సఫలమనో రథుఁడను గాలేక పోయితిని. దానిని ముద్రింపించు చుండినట్లు కొన్నిమాసముల క్రిందట శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి గారు కృష్ణాపత్రికలోఁ బ్రకటించిరి గాని గ్రంథముద్రణము పరిసమాప్త మయి కొనఁగోరువారికది లభ్యమయి నట్లింతవఱకునుగానఁబడదు. ఇటువంటి పుస్తకములను గలవారు తాము వానిని తమయొద్దనే యడచిఁ పెట్టుకొని యుంచక మాతృక నియ్యకపోయినను పుత్రికల నైనను వ్రాయించి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములవంటి ప్రసిద్ధ పుస్తకాలయములయం దుంచినచో వానిని జదువఁ గోరెడునావంటివారి కవి సుసంపాద్యములగును.

ఉదాహరణగ్రంథాదులవలన నాకిప్పుడు పూర్వకవులగ్రంథముల పేరులును వానిలోని పద్యములను పెక్కులు తెలిసినను, ఆకవులు నేను చేసికొన్న సంకేతమునుబట్టి పూర్వ కవులలోఁ జేర్పఁదగినవారో మధ్యకవులలోఁ జేర్పదగినవారో యిప్పడు స్పష్టముగా తెలియరానందున వాని నీప్రధమభాగమునందుఁ జేర్పక తెలిసినవా రాకవులకాలనిర్ణ యాదులు చేసి తెలుపుదు రన్నయపేక్షతో వారిలోఁ గొందఱి నీ పీఠికలోఁ దెలుపుc చున్నాను.