Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

142

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

            నా కొమ్మనకుఁ కల్గె హరిహరామాత్యుండు
                        నెమ్మిలో నతనికిఁ గొమ్మఘనుఁడు
            రహిమీఱ నతనికి రామన తిప్పన
                        యా రామనకు సోమయాహ్వయుండు

            ఆ ఘనునకు వీరనామాత్యుఁ డతనికి
            సోమలింగమంత్రి యా మహాత్ము
            నకును సోమరాజనాముఁడుఁ జిటివీర
            ఘనుఁ డనంగ సుతులు గలిగి రందు.

      సీ. సోమ మంత్రికిఁ గల్గె సుతుఁడు పాపనమంత్రి
                        యతనికి వీరన యా ఘనునకుఁ
            గూరిమితనయులు గోపాలభద్రార్య
                        నరసింహమంత్రు లనంగ ముగురు
            వారిలో నరసింహవరునకు శరభార్యుఁ
                        డును భాస్కరామాత్యుఁడు నరసింహ
            ఘనుఁ డనఁ బుత్రులు కలిగిరి మువ్వురు
                        వారిలో శరభార్యవర్యునకును

            వీరఘనుఁడు గలిగె వేడ్క_నా మంత్రికి
            శరభమంత్రి వరుఁడు జనన మొంది
            ప్రబలి యున్నవాఁడు పాటూరిలోఁ దన
            కులము వర్థిలంగc గొమరుమీఱి

ఈ పద్యములు రెంటిలో మొదటిది పూర్వరచిత మని చెప్పి శరభరాజు గారిచ్చినది; రెండవది శరభారాజుగారిచ్చిన వంశానుక్రమణికను బట్టి బ్రహ్మశ్రీ శతఘంటము వేంకటరంగ శాస్త్రిగారిచే రచియింపఁబడినది. ఇప్పడున్న శరభరాజుగారికిని తిక్కనసోమయాజిగారికిని నడుమ 13 తరములు చెల్లినవి. ఆద్యంతములయం దున్న వీరి నుభయులనుగూడఁ గలుపుకొని తరమొకటికి నలువదేసి సంవత్సరములచొప్పన పదునేనుతర