140
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
కాలమునందే రచియింపఁబడి యుండును. పసుల మేఁతబీళ్ళపుల్లరివిషయమున జరిగిన జగడములో కాటమరాజు వలెనే మనుమసిద్ధియు 1263 -వ సంవత్సరప్రాంతమున రణ నిహతుఁ డయ్యెను. అంతటితో నీతనిరాజ్య మంతరించెను. అప్పటికి భారతము రచింపబడలేదు. అందుచేత సోమదేవరాజీయాదుల యందుఁ జెప్పఁబడిన భారత శ్రవణకధ కవికల్పిత మనుటకు సందేహము లేదు. [సోమదేవరాజీయాదులయందలి వాక్యములనుబట్టి భారతరచన యంతకుమున్నే జరిగిన ట్లూహీంపవీలులేదు. తిక్కన సంస్కృత భారతమును జదివి వినిపించి గణపతిదేవుని మెప్పించి యుండును. కావున పయిగ్రంధములోని వాక్యములు విరుద్ధములని యనుకొననక్కఱలేదు.]
కవియొక్క కాలనిర్ణయమునుగూర్చి యింకొక చిన్న యాధారమును మాత్రము చూపి యీ విషయము నింతటితో విడిచిపెట్టెదను. పద్మపురాణోత్తరఖండము మొదలై న బహుకావ్యములను రచియించిన మడికి సింగన్న తన పితామహుడై న యల్లాడమంత్రికి తిక్కనసోమయాజితోఁ గల బంధుత్వమును తన వాసిష్టరామాయణములో క్రింది పద్యమునఁ దెలిపి యున్నాఁడు.
" సీ. అతఁడు తిక్కనసోమయాజులపుత్రుడై
కొమరారు గుంటూరికొమ్మవిభుని
పుత్రిచిట్టాంబిక బుధలోకకల్పక
వల్లి వివాహమై వైభవమున
భూసారమగు కోట భూమిఁ గృష్ణానది
దక్షిణతటమున ధన్యలీల
నలరు రావెల యను నగ్రహారము తన
కేకభోగంబు గా నేలుచుండి
యందుఁ గోవెల గట్టి గోవిందునన్న
గోపినాధుఁ బ్రతిష్ఠయుఁ గోరి చేసి
యఖిలభువనంబులందును నతిశయిల్లె
మనుజమందారుఁ డల్లాడమంత్రివిభుఁడు."