పుట:Aandhrakavula-charitramu.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

139

తి క్క న సో మ యా జి

నందు కృతిపతి యైన మనుమసిద్ధి యొక్క పరాక్రమమును వర్ణించుచు మహారాష్ట్రసారంగునిఁ దోలి తురంగమును గొనినట్లీ క్రిందిపద్యమునఁ జెప్పి యున్నాఁడు.---

           "శా. శృంగారంబు నలంగ దేమియును బ్రస్వేదాంకురశ్రేణి లే
                దంగంబుల్ మెఱుఁగేద వించుకయు మాహారాష్ట్ర సామంతుసా
                రంగం దోలి తురంగమం గొనిన సంగ్రామంబునం దృప్త స
                ప్తాంగస్ఫారయశుండు మన్మవిధువంపై చన్న సైన్యంబునన్."

ఇందు బేర్కొనcబడిన మహారాష్ట్రసారంగుఁ డద్దంకిసీమకుఁ బాలకుఁడుగా నుండి కాకతీయ గణపతిదేవునికి లోఁబడి యుండిన సామంతరాజు. పయి పద్యమునందు మనుమసిద్ధి మహారాష్ట్ర సామంతుఁడైన సారంగని దోలి తురంగముం గొనినప్పడు శృంగారంబు చెడలేదనియు దేహమునఁ జెమ్మట పట్టలేదనియు నంగములు మెఱుఁగు విడువలేదనియుఁ జెప్పెనేకాని సారంగుని గెలిచి రాజ్యమును గైకొన్నట్టుగాని, యాతనిని పట్టుకొన్నట్లు గాని చెప్పలేదు. ఈపోరాటమునందు సంపూర్ణ విజయము నొందకయే యాతనితోడ సంధి చేసికొన్న గణపతిదేవుని యనుగ్రహామునకు పాత్రుఁ డయ్యెనని తోఁచుచున్నది. * ఈ మనుమసిద్ధి మొదటినుండియు స్వతంత్ర రాజు గాక మొదట కాంచీపురచోడ చక్రవర్తులకును, కడపట కాకతీయ గణపతికిని లోఁబడిన సామంతరాజుగా నుండెను. మహారాష్ట్ర సామంతుని తోడి యీ యుద్దము 1257-వ సంవత్సరప్రాంతమునందలి దయి యుండును. ఈ మనుమరాజు పలుమాఱు శత్రువుల కోటువడి రాజ్యమును పోఁగొట్టుకొనుచు వచ్చెను. కడపట దాయాదులచేత రాజ్యపదభ్రష్టు డయినప్పడు 1260 -వ సంవత్సరము లోపలనే తిక్కనప్రార్ధనపైని గణపతిదేవుఁ డీతనికి తోడుపడి శత్రువుల నడఁచి రాజ్యమునందు మరల నిలిపి యుండును. 1257-వ సంవత్సరము వఱకును జరిగిన వృత్తాంతములుత్తరరామాయణమునందు పేర్కొనఁబడి యుండుటచేత నా పుస్తక మా __________________________________________________________________________ [*సారంగుఁడు మనుమసిద్ధి చే యుద్ధమున నోడింపఁబడినట్లు శ్రీ చిలుకూ పీరభద్రరావుగా 'రాంధ్రుల చరిత్రము'న వ్రాసియున్నారు.]