Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

డైన బయ్యనమంత్రినిగూర్చి వ్రాయుచు నతఁడు తిక్కనసోమయాజిచేత భవ్యభారతి యని పేరు గాంచినట్లు *భోజరాజీయములో నీ క్రింది పద్యమునఁ జెప్పియున్నాడు.

     "చ. క్షితిఁ గ్రతుకర్తనా వినుతి చేకొని పంచమవేదమైన భా
          రతముఁ దెనుంగుబాస నభిరామముగా రచియించినట్టి యు
          న్నతచరితుండు తిక్కకవినాయకుఁ డాదట మెచ్చి భవ్యభా
          రతి యనఁ బేరుగన్నకవిరత్నము బయ్యనమంత్రి యల్పుడే."

ఈ బయ్యన్న మంత్రికొడుకు ముమ్మఁడన్న. ముమ్మఁడన్న కొడుకు తిక్కన: తిక్కనకొడుకు భోజరాజీయాది గంధకర్త యైన యనంతకవి. ఈ యనంతకవి తన రసాభరణమునందు తా నా గ్రంధమును రచించిన కాలము శాలివాహన శకము గా 1356 -వ సంవత్సరమనఁగా క్రీస్తుశకము 1434 వ సంవత్సర మైన ట్లీ క్రింది పద్యమునఁ జెప్పి యున్నాఁడు.

      "శా. జానొందన్ శకవర్షముల్ ఋతుశరజ్వాలేందులై యొప్ప న
           య్యానందాబ్దమునందు మాఘమునఁ గృష్ణైకాదశీ భౌమయు
           క్తానామామృతవేళ నీ కృతి యనంతాఖ్యుండు సమ్యగ్రస
           శ్రీ నిండం ధ్రువపట్టణాధిపున కిచ్చెన్ భక్తి పూర్వంబుగన్."

ఈ కవికిని, తిక్కనసోమయాజి కిని నడుమ ముగ్గురు పురుషులు మాత్రమే యున్నారు. ఒక్కొక్క పురుషాంతరమునకు నలువదియైదేసి సంవత్సరములు చూచినను సోమయాజులు 1300 సంవత్సరప్రాంతము వఱకును జీవించి యుండెనని తేలుచున్నది. తిక్కనసోమయాజులు 78సంవత్సదములు జీవించెనని ప్రసిద్ధి గలదు. అదియే నిజమైనవశమున నతఁడు 1220-వ సంవత్సర ప్రాంతమున జనన మొంది 1300 సంవత్సరప్రాంతము వఱకును జీవించి యుండవలెను. అప్పుడతఁడు ముప్పది నలువది యేండ్ల ప్రాయమున మనుమసిద్ధిజీవితకాలములో నిర్వచనో త్తరరామాయణమును రచించి నట్లును, భారతమును మనుమరాజు మరణానంతరముననే రచియించినట్లును, ఏర్పడుచున్నది. తిక్కనసోమయాజి తన నిర్వచనోత్తరరామాయణము