Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

137

తి క్క న సో మ యా జి

నేను మొదట చెప్పినది గాక 1234 నకు తరువాత నని పైనిఁ జెప్పఁ బడినకాలమే యెక్కువ సరియైనదని నమ్ముచున్నాను. ఏలయన 1234-వ సంవత్సరము నం దీ తిక్కభూపాలుని పేర కాంచీనగరమునందలి యొక దేవాలయములో దానశాసన మొకటి కలదు. తిక్కన నిర్వచనోత్తర రామాయణములోనే యీ తిక్కనరపాలుఁడు తనశై_శవమునందే పృథ్వీశరాజుతల చెండాడె నని యిూక్రింది పద్యమునఁ జెప్పబడినది.

" ఉ. కేశవసన్నిభుండు పరిగీతయశోనిధి చోళ తిక్కధా
        త్రీశుడు కేవలుండె ? నృపు లెవ్వరి కా చరితంబు కల్గునే ?
        శై_శవలీలనాఁడె పటుశౌర్యధురంధరబాహుఁఁడైన పృ
        ధ్వీశ నరేంద్రుమస్తకము నేడ్తెఱఁ గందుకకేళి సల్పడే "

ఈ పృధ్వీశ రాజు పండ్రెండవ శతాబ్దాంతమునం దుండిన వెలనాటి చోడ సామంతరాజు. ఈతని శాసనములు 1180 వఱకును గానఁబడుచున్నవి. ఇతcడు తరువాతఁ గూడ బహు సంవత్సరములు జీవించియుండినట్టు నిదర్శనములు కనఁబడుచున్నవి. అందుచేత నీ తిక్కనృపతి తన యౌవనారంభ దశలో 1190 సంవత్సరప్రాంతముల రణరంగమునందు పృథ్వీశరాజుతలఁ దునిమి యుండును. * ఇవి యన్నియుఁ దిక్కన సోమయాజి 1250 సంవత్సరప్రాంతమునం దుండెనని స్థాపించుచున్నవి.

తిక్కనసోమయాజికాలము నింకను బహువిధములచేత నిర్ణయింపవచ్చును. భోజరాజీయాదికావ్యరత్నములను రచించిన యనంతకవి తన ప్రపితామహుఁ __________________________________________________________________________ [*ఆంధ్రకవి తరంగిణి" లో నిచ్చట క్రింది రీతిని గలదు -- 'ఈ పృథ్విశ్వరుఁడు వెలనాటి చోడుడు, మూఁడవ గొంకరాజుజనకును, జయాంబికకును కుమారుడు............. పృథ్వీశ్వరుని శాసనములు శా. శ. 1108 మొదలు 1128 వఱకును కన్నట్టుచున్నవి. ........ 1128 తరువాత నీతని శాసనములు గన్పట్టుట లేదు. తిక్కరాజు తన శైశవమునందే యీతనిని జంపెనని పై పద్యమునందుఁ జెప్పియుండుటచే 1128-వ యేట నీతఁడు పృథ్వీశ్వరుని సంహరించెననియు, దానినిబట్టి తిక్కరాజా యొక్క జననము 1111 ప్రాంతమై యుండుననియు నిశ్చయింపవచ్చును.' (రెండవ సంపుటము పుట 2O1)]