పుట:Aandhrakavula-charitramu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

135

తి క్క న సో మ యా జి

..........ఇంతేకాదు చాళుక్య నాల్గవ సోమేశ్వరుని కాలములో చోళరాజ్యమును బరిపాలించుచున్నవాఁడు మూఁడవ కులోత్తుంగచోడుఁడు. ఇతఁడు మిగుల పరాక్రమశాలి చోళ దేశమే కాకుండ, ఆంధ్రదేశము కూడ నీతని యేలుబడిక్రింద నుండెను. అట్టివాని నీ నాల్గవ సోమేశుఁడు చోళ సింహాసనమునుండి తఱిమివేయుట తటస్థింపదు . . . . . ఇందు (పద్యమునందు) చూపఁబడిన సోమేశ్వరుఁడు (హొయ్యలవంశీయుఁడు) కర్ణాట దేశమును శా.శ. 1156 మొదలు 1178 వఱకును పాలించినట్లు శాసనాధారములు కన్పించుచున్నవి . ........ఈకాలములో చోళ రాజ్యమ ను బరిపాలించుచున్నవాఁడు మూఁడవ రాజేంద్రచోళుఁడు. ఇతఁడు బలహీనుఁడై రాజ్యసంరక్షణమునందసమర్ధుఁడై యుండెననియు, నీ సమయమున నీ వీరసోమేశ్వరుఁడు బలవంతుఁడై యాతనిని జయించి చోళసింహాసనము నాక్రమింపఁగా, మన తిక్కరాజు వీరసోమేశ్వరు నెదుర్కొని పోరాడి, చోళసింహాసనమున మూఁడవరాజేంద్రుని నిలిపె ననియుఁ జరిత్రకారులు తలంచుచున్నారు. ఇది సత్యమనుటకు సంశయింప నక్కరలేదు. ఈ మూడవ రాజేంద్రచోళుఁడు, శా.శ.1167 మొదలు 1186 వఱకును చోళ సింహాసనమునం దున్నవాఁడు కావున తిక్కరాజు శా. శ.1167 సంవత్సరమునకుఁ బిమ్మట ననఁగా శా. శ.1170 ప్రాంతమున సోమేశ్వరుని జయించి యుండవచ్చునని తలంపవలసియున్నది. ఈ సోమేశ్వరునిచే జయింపఁబడినవాఁడు మూఁడవ రాజేంద్రచోళుఁడు గాక మూఁడవ రాజరాజని తలంచితిమేని, యాతని పరిపాలనా కాలము శా. శ. 1138 మొదలు 1170 వఱకునునై యున్నది. కావున తిక్కన సోమేశ్వరుని జయించినది శా. శ 1160 ప్రాంతమైయుండును. ఇదియే సత్యమని నాఅభిప్రాయము. (చూ రెండవసంపుటము పుటలు 203-205 )"]

అయియుండినపక్షమున ఈ యుద్ధము 1186 -వ సంవత్సరప్రాంతముల యందు జరిగి యుండవలెను. దీనినిబట్టి తిక్కనృపాలుఁడు 1200 -వ సంవత్సరప్రాంతము వఱకయినను రాజ్యము చేసి యుండును. దీనినిబట్టి యీ తిక్కనృపాలునిపుత్రుఁడును నిర్వచనోత్తరరామాయణకృతిపతియు