జేయవలసినమార్పులను సూచింపవలెను.పైని పేర్కొనcబడినవారు గాక గిడుగు రామమూర్తి పంతులుగారును బుజ్జా శేషగిరిరావు పంతులుగారును గూడcదమకు దోఁచినయభివృద్ధిమార్గములను నాకుపదేశించి నాకృతజ్ఞత కర్హులైరి. అందఱి కంటె నెక్కువగా నాకు చిరకాల మిత్రులును, ఆంధ్ర భాషా వాఙ్మయము నందు విశేషకృషి చేసినవారును, దేశాటనముచేసి యపూర్వపుస్తక సంపాదనము చేసిన వారును నైన శ్రీమానవల్లి రామకృష్ణకవి గారు నా కెంతోసాయపడుదురని కొండంతయాశ పెట్టు కొంటిని గాని, వారి సాయమును బొందు భాగ్యము నాకింకను లభింప నందునకుc జింతిల్లు చున్నాను.కడచిన మార్చి నెలలో మిత్రుల కైదాఱుగురికి వ్రాసినప్పడే వీరికిని వ్రాయగా జూన్ నెల వఱకును తాము సాయము చేయుటకు పనులతొందర చేత నవకాశముండ దని వారప్పుడుత్తర మిచ్చిరి. ఒక పనిని చేయవలెనని సంకల్పించుకొన్న తరువాత దాని నారcభించి ముగించువఱకును నాకు నిద్ర పట్టదు. కాల మమూల్యమైనది.నేఁడు వ్యర్ధముగా బోఁగొట్టబడినకాలము రేపు కలిసిరాదు. చేయcదలఁచుకొన్నపనిని రేపటి కని నిలిపి యుంచక నేఁ డన్న దినముననే చేయవలెనని తొందరపడు స్వభావముగల వారిలోఁ జేరినవాఁడను నేను. బ్రతు కస్థిరమగుట చేత ఱేపటిదినము మన దగునో కాదో యస్న సందేహము తో వారు పెట్టిన గడవువచ్చు వఱకు నేను వేచియుండక తోడనే కవిచరిత్రమును సవరింప నారంభించి సవరించిన భాగము నెప్పటికప్పడె ముద్రింపింపఁ దొడంగితిని. అందుచేత నేను పుస్తకము యొక్క సవరణము ముగించునప్పటికి పుస్తకము యొక్క ముద్రణముకు సహితమించు మించుగా ముగిసెను.
ఈలోపల నేను చెన్నపురిమీదుగా గడచిన ఏప్రిల్ నెలలో బెంగుళూరికిఁ బోవుచుఁ ద్రోవలో నీపనివిూcదనే చెన్నపట్టణములో రెండుదినములు నిలిచి ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారమునకుఁ బోయినప్పడు వారిపనులనుకొన్న దానికంటే శీఘ్రముగానే తీఱి శ్రీరామకృష్ణ కవి గారు చెన్నపట్టణము చేరఁగలిగినందున వారినక్కడఁ దలవనితలంపు గాc జూడఁదటస్థించెను. ఆవఱకు లేఖామూలమునఁ జేసిన ప్రార్థనము నే నేనప్పడు వారికి స్వయముగాఁ గూడఁజేసితిని. నేను బెంగుళూరు చేరి పనిచేయుచు నేప్రిల్ నెలకడపట వారివాగ్దానమును జ్ఞప్తికిఁ దెచ్చుచు వారి కుత్తరములు వ్రాసితిని. నాయుత్తరములకుఁ బ్రత్యుత్తరముగా తాము జాన్ నెల తరువాతనే సాయము చేయఁగలుగుదు మని వాగ్దానము చేసితి మనియు, తమ కార్యస్థానపు పని సామాన్యముగా నుండుదానికంటే నత్యధికముగా నుండిన దనియు, తమ పుస్తకము లన్నియు వనపర్తిలో నే విడిచిపెట్టబడిన వనియు, అయినను దమశక్తిలో నున్నంతవఱకు నేను గోరిన సమాచారమును మఱుఁనాటి టపాలోఁ బంపెద మనియు, నేను వేగిరపాటుతో పని నడుపుచున్నందులకు చింతిల్లుచున్నా మనియు, మొదటిభాగములోఁ జేయబడిన ప్రాఁత నిర్దేశము లనేకములు మార్పబడవలసియున్నవనియు, నూఱుగురు నవకవులు మొదటి భాగములోఁ జేర్పఁ