Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1౩౦

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

      సీ. 'అంతటఁ పాండ్యదేశాధీశ్వరునిమీఁద
                    దండెత్తి వానిమస్తకము దునిమి
            ........నందముగఁ బట్టము గట్టి
                    వానిచేఁ గోటిసువర్ణ నిష్క
            ములు పన్ను గొని రయంబున సేతుబంధరా
                    మేశ్వరంబున కేగి యెలమితో ధ
            నుష్కోటిలోనఁ బొందుగc దీర్థమాడి యె
                   న్మిదితులాపురుషము ల్గొదుక కచటఁ

            దూఁగి క్రమ్మఱ నిజపురి కేగి ఠీవి
            వఱల నెమ్మది నఱువదివత్సరములు
            రాజు లెన్నఁగ నమ్మహారాజమౌళి
            లీల మెఱయంగ ధాత్రి బాలించె నంత '

పయి పద్యము ప్రకారము కాకతిప్రళయునిపుత్రుఁ డయిన యీ మొదటి ప్రతాపరుద్రురాజ్యకాలము శాలివాహనశకవత్సరములు 1062 మొదలు 1122 వఱకును అగును. ప్రతాపరుద్రుని యనంతరమునందే యాతని పుత్రుఁడయిన గణపతిదేవుఁడు రాజ్యమునకు వచ్చినందున, ఈతని రాజ్యారంభకాలము శాలివాహనశకము 1122 వ సంవత్సర మనఁగా క్రీస్తు శకము 1199-వ సంవత్సరమగును. పయిని చెప్పినట్లితఁ డేఁబది యెనిమిది సవత్సరములు రాజ్యము చేసినందున, సోమదేవరాజీయమును బట్టి సహితము గణపతిదేవుఁడు 1199-వ సంవత్సరము మొదలుకొని 1253 సంవత్సరమువఱకును రాజ్యము చేసినట్లే యేర్పడుచున్నది ఈ కాలము శాసనములవలనఁ దెలియవచ్చెడు కాలముతో నించుమించుగా సరిపోవుచున్నది గణపతిదేవుని రాజ్యకాలములోఁ దిక్క_నసోమయాజి తన ప్రభువగు సిద్ధిరాజు పనిమీఁద నా తనియాస్థానమునకుఁ బోయి యుండినందునఁ దిక్కన తప్పక 1200-1253 సంవత్సరముల మధ్యమున జీవించి యుండవలెను. సత్యమిట్లుండఁగా శ్రీరామమూర్తిపంతులుగారు రామాయణకర్త యగు భాస్కరుని కాలనిర్ణయము చేయుటలో సోమదేవ