పుట:Aandhrakavula-charitramu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

      చ. ఎలమిఁ బ్రతాపరుద్రమనుజేంద్రునిచేఁ బడసెం బ్రవీణుడై_
          కొలిచియు శార్యశీల రిపుకోటి రణావని గీటడంచియున్
          బలరిపుతుల్యవిక్రముఁడు నాగయగన్నవిభుండు తేజమున్
          విలసితరాజచిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్.

అను పద్యములయందుఁ గవి కృతిపతియొక్క మాతామహుఁడై న మేచ నాయకుఁడు కాకతీయ గణపతియొక్క తలవరి యైనట్టును, కృతిపతి యగు గన్నదండనాధుఁడు కాకతీయ ప్రతాపరుద్రుని దళవాయి యయినట్టును, స్పష్టముగాఁ జెప్పి యున్నాడు. తిక్కనసోమయాజి శిష్యుఁ డయిన మారనవలన మార్కండేయపురాణమును గృతి నందిన గన్నమంత్రియొక్కప్రభువగు ప్రతాపరుద్రుఁడీతఁ డనియు, ఆ ప్రతాపరుద్రునికాల మిది యనియు, స్పష్టపడినప్పుడు తిక్కన కాలమును నిశ్చయముగా తెలిసినట్టే! గణపతిదేవుని కూఁతురయిన రుద్రమదేవి యనంతరమునందు రాజ్యమునకు వచ్చిన యా యోరుగంటి ప్రతాపరుద్రుఁడు 1295 వ సంవత్సరము మొదలుకొని * 1323-వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేయుటయు, 1309 -వ సంవత్సరమునందు మహమ్మదీయు లేకశిలానగర మనఁబడెడి యోరుగంటిమీఁదికి దండెత్తి వచ్చి మొట్టమొదటఁ బ్రతాప రుద్రునిచే నోడఁగొట్టఁబడి, పలాయితులయ్యును, రెండవ యుద్ధమునం దాతనిని జయించి ఢిల్లీ పాదుషాకుఁ గప్పము గట్టునట్లు చేయుటయు, తరువాత నతఁడు దేవగిరిరాజును దనకు సహాయునిగాఁ జేకొని మహమ్మదీయులకుఁ గప్పము కట్టుట మానివేయఁగా నప్పటి టోగ్లాకు చక్రవరి ప్రతాపరుద్రుని శిక్షించుటకయి 1321-వ సంవత్సరమునందుఁ దన కొడుకగు ఉలగ్ ఖానును సేనలతోఁ బంపినప్పు డతcడువచ్చి కోటను ముట్టడించి కడపటఁ బరాజితుఁడయి చెల్లాచెద రయిన తన సేనలతోఁ బాఱిపోవుటయు, ఈ యవమానమును దీర్చుకొనుటకయి మహమ్మదీయులు 1323-వ సంవత్సరమునందు మరల దండెత్తి వచ్చి ప్రతాపరుద్రుని నోడించి __________________________________________________________________________ *[ 1326 వ సంవత్సరమువఱకును రాజ్యపాలనము చేసినట్లు 'ఆంధ్రకవి తరంగిణి'లోఁగలదు, (ద్వితీయ సంపుటము 47 పుట)]