Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భాగము తగ్గి పోయినను బుద్ధిబలమింకను పూర్ణముగా తగ్గిపోలేదని నేనీ ప్రయత్నమువలనఁ దెలిసికొనుచున్నాఁడను. వ్రాయునప్పడు నా చేతులు వడకు చున్నవి; కన్నులు మండుచున్నవి, ఆయినను కలము చేతఁ బుచ్చుకొన్నప్పడు మునుపటివలెనే చిత్తక్కఱలేకయే వ్రాయcగలుగుచున్నాను. ఈ ప్రధమభాగ మేదోవిధముగా నిప్పటికి ముగింపఁబడెనుగదా ! దీనియం దీవఱ కితరుఁ లెఱుఁగని నూతన విషయములును చరిత్రాంశములును విశేషముగా లేకపోయినను పుస్తక పరి మాణముమాత్ర మేలాగుననో మూడురెట్లకంటె నథికముగా పెరిగి యీ యొక్క భాగమే యొక్క ప్రత్యేక సంపుటముగాఁ జేయఁబడ వలసినదయ్యెను.


ఈ పనిలో నాకుఁ దోడ్పడినవారిలో నామిత్రులును విజ్ఞానచంద్రికాసంస్థాపకులను నయిన శ్రీకొమఱ్ఱాజు వేంకటలక్మణరావుగారగగ్రణ్యులని చెప్పవలసియున్నది. వారు గ్రంథ సంస్కారమును గూర్చి యనేక నూచనలు చేయుటయే కాక నేను కోరిన శాసనములను గ్రంథభాగములను వ్రాసిన వెంటనే పంపి నాకృతజ్ఞత కత్యంతపాత్రులయియున్నారు. ఆంధ్ర పరిషత్సంస్థాపకులును పరిషత్పత్రికా సంపాదకులు నయిన మన్మిత్రులని జయంతి రామయ్య పంతులుగారు యుద్ధమల్లుని శాసనములోని పద్యములను వ్రాసి పంపియు తాము (పకటించుచుండిన కవిజనాశ్రయ ఛందస్సు యొక్క పీఠికను ముద్రింపఁబడకముందే జేరునట్లు చేసియు నాకు సాయము చేసిరి.

ఆంధ్ర పరిషత్పత్రికా కార్యనిర్వాహకులైన కొత్తపల్లి సూర్యారావుగారును, చెన్నపురి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగార కార్యస్థానమునందు పండితులుగానున్న వేటూరి ప్రభాకర శాస్త్రిగారును, పంచాగ్నుల దక్షిణామూర్తి శాస్త్రిగారును, తమగ్రంధాలయములో నున్న పుస్తక భాగములను పద్యములను నేను కోరినవానిని వ్రాసి పంపినాకెంతో తోడుపడిరి. పిఠాపురములోని యాంధ్ర పుస్తక పరిశోధకమండలివారి గ్రంథాలయ కార్యనిర్వాహకులైన వంగూరిసుబ్బారావుగారు తమగ్రంధాలయములోని పుస్తకములను నేనుకోరినవానిని దెచ్చి యిచ్చియు కవులను గూర్చి తాము వ్రాసిన సేకరించిన యంశములను దెలిపియు నాకు సాహాయ్యము చేసిరి. వారి కందఱికి నిందుమూలమున నాకృతజ్ఞతాపూర్వకములైన వందనములను సమర్పించుచున్నాను. వారు చేయవలసిన సాయ మింతటితో తీఱిపో లేదు. ఇప్పుడన్నిటిలో చిన్నదయిన ప్రథమ భాగమొక్కటిమాత్రమే ముగిసి యింకను పెద్ద భాగములు రెండును మిగిలియేయున్నందున వారు చేయవలసినసాయ మంతయు నించుమించుగా ముందే యున్నదని చెప్పవచ్చును. మధ్యకవులలోను, ఆధునిక కవులలోను, క్రొత్తగా చేరవలసినవారి పేరులను, చరిత్రములను దెలుపవలెను; ఉన్నవానిలో తాఱుమాఱుగాఁ బడియున్నవానిని జూపుటయేగాక యందలి లోపములను గనఁపఱుపవలెను, ఇంకను బహువిధముగఁ