Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

111

తి క్క న సో మ యా జి

సిద్ధి కోడూరుగ్రామము నొక బ్రాహ్మణునకు దానము చేసినట్టును, కాకతీయ గణపతిదేవునిక రుణను కాంక్షించుచుండినట్టును చెప్పఁబడి యున్నది. వీనినిబట్టి చూడఁగా గణపతిదేవుఁడు 1253 వ సంవత్సరమువఱకును మనుమసిద్ధికి సాయము చూపినట్టు కానఁబడదు. చూపినచో 1254 వ సంవత్సరమునకును 1260 వ సంవత్సరమునకును నడుము చూపి యుండ వలెను. 1262 వ సంవత్సరమునకుఁ బయిని మనుమసిద్ధి శాసనము లెందును గానరావు. అందుచేత నాతఁ డా తరువాత నల్పకాలములోనే కాల ధర్మము నొcదియుండును. అంతేకాక కృష్ణామండలచరిత్రసంగ్రహము నందు *యఱ్ఱగడ్డ రాజయిన కాటమరాజును పల్నాడుప్రభువైన పద్మనాయకుఁడును గలిసి పశువుల మేఁతబీళ్ళవిషయమయి పదుమూఁడవ శతాబ్దమునందు నెల్లూరి ప్రభువైన సిద్ధిరాజుతో యుద్ధము చేసినట్లును, సిద్దిరాజుసేనలు కవితిక్కన తమ్మునికుమారుఁడై న తిక్కనమంత్రిచే నడుపఁ బడినట్టును, చెప్పఁబడి యున్నది. కవి తిక్కనతమ్ముఁడనుటకుఁ దమ్ముని కుమారుఁడని పొరపాటునఁ బడి యుండవచ్చును. ఈ రణతిక్కన్న మన తిక్కన్నకు సాక్షాత్సహోదరుఁడు కాక పెదతండ్రికొడుకయి యున్నాcడు. ఇవి యన్నియు నిటుండఁగా తిక్కనసోమయాజి శిష్యుడయిన మారన తాను తెనిఁగించిన మార్కండేయపురాణమును ప్రతాపరుద్ర దేవుని మంత్రులలో నొకఁ డయిన నాగయగన్నమంత్రి కంకితము చేసినట్లా పురాణములోని యీ క్రింది పద్యమువలనఁ దేటపడుచున్నది.-

           సీ. తన సమజ్జ్వలమూర్తి జనలోచనాంభోజ
                     ములకు మార్తాండుని మూర్తిగాఁగ
               తన నయోపార్జితధనమున కర్థి దో
                     స్థ్సలులు విక్షేపణస్థలులుగాఁగ
               తనభూరితర తేజ మనుపమనిజవంశ
                     భవనంబునకుఁ బ్రదీపంబుగాఁగ
               తన వినిర్మలయశంబునకు దిశాతటం
                     బులు దృఢ శాసనశిలలుగాఁగ

__________________________________________________________________________ [*ఇది యెఱ్ఱగడ్డపాడు"గాని యఱ్ఱగడ్డకాదు.]