Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగదేవభట్టు


ఇతఁ డమరకోశమునకు వ్రాసిన తెలుఁగు టీక యొకటి లభ్యమగుచున్నది. అం దది 'నాగదేవభట్టోపాధ్యాయ' కృత మని యున్నది. విద్వాంసు డఁగు నాగదేవ భట్టారకుని ప్రశంస శ్రీనాధుని క్రీడాభిరామమునఁ గలదు క్రీ. శ.1134 ప్రాంతమున నుండిన సుప్రసిద్ధవ్యాఖ్యాత మల్లినాధసూరి తన "వైశ్యవంశసుధార్ణవము"న నీతని యమరటీకను పేర్కొనియున్నందున, ఇతఁడతనికంటె బూర్వఁడనుట స్పష్టము.

కీ శ 1149 నాఁటి దాక్షారామ శాసనములోను, క్రీ. శ. 1151 నాఁటి ప్రేంపల్లి భావనారాయణసామి యాలయములోనున్న శాసనమునందును పేర్కొనబడిన నాగదేవకవియే యీ నాగదేవభట్టారకుఁడని "తెనుఁగు కవుల చరిత్ర" (పుట 285) వలనఁ దెలియుచున్నది.