Jump to content

పుట:Aandhrakavula-charitramu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

95

మ ల్లి కా ర్జు న పం డి తుఁ డు

శ్రీ శర్మగారు "శతక" మనుదానిని 'శివతత్త్వసార' మనుదానికి విశేషణముగా గ్రహించినందున, ఆరీతిఁ దలఁపవలసివచ్చినది. కాని 'శతక' మను నది విశేషణమే యనుటకుఁ బ్రమాణములేదు. నూఱు పద్యములు కలదే శతకము. వేయి పద్యములు గలది శతకమనుట సంప్రదాయసిద్ధముకాదు.సోమనాధుఁడు పేర్కొనిన 'శతకము' శ్రీ నిడుదవోలు వేంకటరావుగారు (తారణ-ఫాల్గణమాస భారతి ) భావించినట్లు పండితారాధ్యుని ' శ్రీగిరిమల్లి కార్డునశతక' మై యుండవలెను. అందలి పద్యమొకటి "తెనుఁగు కవుల చరిత్ర" ఆనుబంధమునందు (పుట 388) -ఈయcబడినది. మఱియు, తెలుఁగు శతకములకుఁగల మకుటనియమము శివతత్త్వసారమునఁ గాన రాదు.

మల్లి కార్జునపండితుఁడు పెక్కు-గ్రంధములను రచించినను, అవి లభింపకపోవుటయు, లభించిన 'శివతత్త్వసార' మసమగ్రముగా నుండుటయు నాంధ్రుల దురదృష్టము.