94
ఆం ధ్ర క వు ల చ రి త్ర ము
సారము" కన్నడమునను గలదు. ఆందలి కొన్ని పద్యములు మద్రాసు ప్రభుత్వ ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారము వారు ప్రచురించుచున్న పత్రికలో (Vol 1L No. 1, 2. 1949) ప్రకటింపఁబడినవి [184 నుండి 4911 వఱకు, 715 నుండి 740 వఱుకును ] కన్నడగ్రంథమునకు మూలము తెనుఁగు గ్రంధమని స్పష్టముగాఁ దెలియుచున్నది. ఈ గ్రంధమును బట్టియు తెలుఁగు గ్రంధములోని పద్యసంఖ్య సహసమై యుండవచ్చునని తోఁచుచున్నది.
పాల్కురికి సోమనాధుఁడు తన యనుభవసారములో నీతనింగూర్చి
".............. శివత త్త్వ
సార గద్య పద్య సమితి శివువి
మహిమఁ దెలిపినట్టి మల్లి కార్డున పండి
తయ్యగారిఁ దలంతు ననుదినంబు"
అని చెప్పియున్నాఁడు, "ఆంధ్రకవితరంగిణి" కారులు పైయంశము నుటంకించుచు "పండితయ్య రచించిన శివత_త్త్వసారము గద్య పద్యాత్మకమని యీ పద్యమునఁ జెప్పఁబడినది. కాని యాగ్రంధమున పద్యమలేగాని గద్యలు లేవు' (రెండవసంపుటమ-పుట 84] అని వ్రాసిరి. కాని పయి పద్యభాగము 'మల్లిఖార్జునపండితయ్య శివత త్త్వసారమును, గద్యలను, పద్యములను రచించె' ననియే చెప్పచున్నది; కాని శివతత్త్వసారము గద్య పద్యాత్మకమని తెల్పుటలేదు.
"శివత త్త్వసారము" శతకమని కవి స్వయముగాఁ జెప్పకున్నను -దీని లక్షణము లన్నియును శతకలక్షణములే యగుటవలన నిది శతకమే యన దగు నని శ్రీ వేదము వేంకటకృష్ణశర్మగారు తమ 'శతకవాజ్మయ సర్వస్వము" లోఁ జెప్పియున్నారు. 'శతకంబు శివతత్త్వ సారమాదిగను. గద్య పద్యంబు లాకాంక్షఁ జదువుచును"-(దీక్షాప్రకరణము) శతకము శివతత్త్వసారము దీపకళిక, మహా నాటకము నుదాహరణ' (పర్వతప్రకరణము)" అను సోమనాధుని గ్రంధభాగములను దానికిఁ బ్రమాణముగా విచ్చియున్నారు, [పుటలు 11, 12]