93
మ ల్లి కా ర్జు న పం డి తుఁ డు
గౌరవింపఁబడి పానుగంటికిఁ బోయెను. ఆ యూరి నపుడు 'ఉదయనుఁడు' పాలించుచుండెను. పింగళి గోవింద ప్రధాని యాతని మంత్రి. పండిత భక్తుఁడగు గోవిందుఁ డితనిని మిక్కిలి గౌరవించెను. ధవళేశు నామయ్య యను భక్తుఁ డీతని సేవలో మగ్నుఁడయి రాజసేవయందుఁ బ్రమత్తుఁడై తుదకాత్మహత్య చేసి కొనెనఁట !
వనిపురములో శంకరయ్య యను పూజ లందు గొని ప్రయాణము కానుండఁగా అంతకు ముందెనిమిది దినముల క్రిందటనే బసవేశ్వరుడు లింగైక్యము చెందెనని మిగుల దుఃఖించి పండితుడు శ్రీశైలమునకు ప్రయాణమయ్యె. తాను వెల్లటూరిలో నిలిచి తన శిష్యుడైన దోనయ్యను గిరిప్రయాణముచేసి, శివరాత్రికి శ్రీశైలమునకేఁగి,తన పరిసమాప్తి నొందించవలెనని కోరెను ఆతఁడు తిరిగి వచ్చిన తర్వాత పండితారాధ్యుడు భార్యాపుత్రుదులతో లింగైక్యముఁ చెందెను.
ఈతని "శివతత్త్వసారము" నకు విపులముగ నుపోద్ఘాతమును వ్రాసిన కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావుగారేయీ కాలమును నిర్ణయించిరి. క్రీ. శ. 1163-1180 నడుమనున్న వెలనాఁటి చోడుఁడు, 1162 ప్రాంతమున నున్న ఉదయావనీశుడు, 1171 ప్రాంతమున నుండిన బుద్దరాజు నితని సమకాలికులు. కావున నితఁడు 1120-1190 ల మధ్యకాలమున నుండవలెను.
మల్లికార్జున పండితుఁడు శివతత్త్వసారము, మహిమ్నస్తవము, మలహణము, పంచగద్యలు, రుద్రమహిమ, శంకరగీతి, రక్షాధ్వరము, దాసాష్టకము, తుమ్మెదపదములు, ఆనందపదములు, శంకరపదములు మున్నగు పెక్కుగ్రంధములను రచించినట్లు సోమనాధుని 'పండిరాధ్యచరిత్రము" వలననే తెలియుచున్నది ఇతఁడు కన్నడమున 'గణసహస్రనామ' మను కావ్యమును రచించెనని కన్నడకవిచరిత్రమునం దున్నది. కాని యిప్పటికి లభించిన దొక్క "శివత త్త్వసారము" మాత్రమే.
ముద్రితమైన "శివతత్త్వసారము"న 489 కందపద్యము లున్నవి. ఇందు వేయి పద్యము లుండియుండవలెనని కొందఱి యభిప్రాయము 'శివతత్త్వ