పుట:Aandhrakavula-charitramu.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మల్లియ - రేచన


భీమకవి కృతిగాc బ్రసిద్ధిచెందిన "కవిజనాశ్రయ"మను ఛందోగ్రంథమును రచించినవాఁడు మల్లియ రేచన. కవిజనాశ్రయము ప్రథమలక్షణగ్రంధమని పండితలోకమునఁ బ్రసిద్దము. ఇయ్యది వేములవాడ భీమకవి కృతి కాదని "వేములవాడ-భీమకవి" చరిత్రమున వివరింపఁబడును.

భీమకవి కాలము నిర్వివాదముగ క్రీ. శ. 1160-1180 ప్రాంతముగ స్పష్టపడి యున్నది. కవిజనాశ్రయము క్రీ. శ. 1100 ప్రాంతమందలిది.

కవిజనాశ్రయమునందలి భాగములగు 'ఆధికారము"ల గద్యలయందు 'ఇది శ్రీవాదీంద్రచూడామణి చరణ సరసీరుహ మధుకరాయమాన . ." అని యున్నది. ఈ 'వాదీంద్రచూడామణి" అను జైన సమయాచార్యుని, నన్నెచోడమహాకవి రచించిన కుమారసంభవమునకుఁ గృతిపతియైన జంగమ మల్లి కార్డునయోగి వాదమునందోడించినట్టు "పరవాదీంద్రఘనాఘనా నిలు" అను పద్యపాదము [కుమార-అ-8-197 ] ధ్వనించుచున్నదనియు, కుమారసంభవమునఁ గవిజనాశ్రయపుటనుసరణములు కానవచ్చుచున్న వనియు "తెనుఁగు కవుల చరిత్ర" (పుట 171) లోఁ గలదు. [1]నన్నెచోడుఁడు 11౩0-40 ప్రాంతమువాఁ డగునప్పడు కవిజనాశ్రయము 1100 ప్రాంతము ననే వెలసినదని చెప్పటకు వీలు కలుగుచున్న దని ఆ పుటయందే శ్రీ వేంకటరావు గారు తెల్పియున్నారు.

ఈ క్రిందియంశము "తెనుఁగు కవుల చరిత్ర" ననుసరించియే తెలుపcబడుచున్నది.

అఱవభాషలో 12 వ శతాబ్దికిఁ బూర్వమే "యాప్పిరుంగలమ్ కారికై "అను లక్షణగ్రంధము ప్రసిద్ధమైయున్నది. ఇందు అఱవమునందలి ఛందోగ్రంథ


  1. కుమారసంభవమున నవమాశ్వాసాంతమున నున్నట్లు 'తెనుఁగు కవుల చరిత్ర' లోఁ గలదు. కాని యిది ఆందలి 8-వ ఆశ్వాసమున 197 వ పద్యముగాఁగలదు.