పుట:Aandhrakavula-charitramu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

ఆం ధ్ర క వు ల చ రి త్ర ము

ద్వితీయ, తృతీయాశ్వాసములయందు తొలగు కులమువారనఁ బడెడి దేవాంగుల కథయు చెప్పఁబడినవి. ఇందు వెుదటి యాశ్వాసమునందు 50 పద్యములును, రెండవ యా శ్వాసమునందు ౩౦ పద్యములను, మూఁడవ యాశ్వాసమునందు 3ం పద్యములును మొత్తముమీఁద పుస్తకమునందు 125 పద్యగద్యము లున్నవి. "ఇది శ్రీసకల భాషావాగను శాసన శ్రీ నన్నయభట్ట విరచితంబై న చాముండికావిలాసంబునందుఁ బ్రధమాశ్వాసము" అనియు, "ఇది శ్రీసకల సుకవిజన శ్రేష్ఠ నన్నయభట్ట విరచితంబైన చాముండికావిలాసంబను మహాప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము"అనియు "ఇది శ్రీ సకల కవి బుధవినుత సర్వవిద్యా విచక్షణ నన్నయభట్ట విరచితం బై న చాముండి కావిలాసం బను మహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము. అనియు, ఆశ్వాసాంత గద్యములు వేఱువేఱు విధముగా నున్నవి పయిని జెప్పఁబడిన హేతువులనుబట్టి విచారింపఁగా నీ చాముండికా విలాసమును నూఱు సంవత్సరముల క్రిందట దత్తమండలములలోని నందవరీకు లెవ్వరో నన్నయభట్టు పేరుపెట్టి రచించినట్టు నాకుఁ దోఁచుచున్నది. కర్నూలులోని చంద్రమౌళీశ్వర ముద్రాయంత్రములో 1916 వ సంవత్సరమునందు ముద్రింపఁబడిన 'చౌడేశ్వరీ విలాస" మను పుస్తకమును నేను గొన్ని దినముల క్రిందటఁ జూడ తటస్టించినది. ఈ చౌడేశ్వరీవిలాసము సరిగా చాముండికావిలాసమే: చాముండికావిలాసమని యున్నచోట్లనెల్ల చౌడేశ్వరీ విలాస మని మార్చఁబడి యుండుట తప్ప భేదమేదియు లేదు. వ్రాఁత పుస్తకము నందువలెనే యచ్చుపుస్తకమునందును తప్పులు కుప్పలుగా నున్నవి. ఇది నన్నయభట్టు కవిత్వ మగునో కాదో తామే నిర్ణయించు కొనఁగలుగుట కనుకూలముగా నుండునని యీ రెండు పుస్తకములనుబట్టి సవరించి నందవరచరిత్రము నిందు క్రిందఁ బొందుపఱచుచున్నాను.

". . . . . . . . . సోమవంశంసంభవుండైన నందచక్రవ ర్తి యన్మహా, రాజ శ్రేష్ఠుండు నందవరపురంబున సకల ధర్మాభిజ్ఞుండై సర్వవేదవేదాంగ