పుట:Aandhrakavula-charitramu.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

79

న న్న య భ ట్టు

[6] ఒక వర్ణమును జేయునప్పడు దానికి ముందు క్రొత్తగా నేఁబది యఱువది సంవత్సరముల క్రిందట చెన్నపురినుండి వచ్చిన యక్షగాన రూపకము లయిన ప్రహ్లాదాది నాటక పుస్తకములయం దుండిన రీతిగా "ఎట్టు లనిన" "ఎభ్భంగి ననిన" లోనగు పదప్రయోగములను జేయుట.

1. "ఒకయాడుఁబడుచు పుట్టె నెట్టు లనిన.

సీ. ఘనకరాళవరాస్యగహ్వరంబులు గల్లి
            పరఁగ చతుశ్శీర్ష పంక్తి మెరయ

  • * * * *


    రూప యైనట్టి పడుచును రూడి గాఁగఁ
    దాము దర్శించి పూర్వంబు దలఁచి తలఁచి" ఆ - 2 - 20

2. అట్టి దానియందు మహాశక్తి యుదయించి వచ్చె నెట్లనిన.

ఉ. భీకరసింహ వక్త్రములు పేర్మిఁ జతుష్టయ మొప్పచుండఁగా
    లోక భయంకరంబు లయి లోచనముల్డనరారఁ బాటల
    ప్రాకటవర్ణము ల్గలిగి భాసిలి మీఱుచు నాల్గు హస్తముల్
    వీఁక నెసంగఁగా నపుడు వీరమహాద్బుత శక్తి చెల్వుగన్." ఆ - 3 - 3

   *తా మంతఃపురంబులకు బోయి రెభ్భంగి ననిన

చ. వదలిన కేశబంధములు వట్రువగుబ్బల మీఁది హారఘుల్
    చెదరిన కుంకుమంబులును జెక్కుల వ్రాసిన పత్రవల్లులున్
    బ్రిదిలిన నీవిబంధములు విశ్రుతమైన ముసుంగు లెంతయుం
    గదలఁగ లేదుముందనుచు గాంతలు పోయి గృహాంతరంబులన్."
       
                                                   ఆ- 3 - 22

చాముండికా విలాసములోని మూఁడా శ్వాసములలోను బ్రథమాశ్వాసమునం దాఱువేల వారియొక్కయు, నందవరీకుల యొక్కయు వృత్తాంతమును,