ఆంధ్ర సాహిత్య
పరిషత్పత్త్రిక.
కాకినాడ.
రెండునెలల కొకసారి ప్రకటింపబడును.
సంపుటము 24.
యువనామసంవత్సరము.
మార్గశిరపుష్యమాసములు.
సంచిక 5.
సుకవి.
జయంతి స్వామినాయనగారు, ముమ్మిడివరము.
గీ. విశ్వమెల్లను నీలోన వెలయు నేమొ, వెలయుచున్నావ్? నీవె యీవిశ్వ మెల్ల
విశ్వమే నీవొ నీవ యీ విశ్వ మేమొ, లేశ మైనను భావింపలేము కాని
యేము “నిదమిద్ద”మని చెప్ప లేము కాని, నీమహృదయంబువిశ్వంబునిండియుండు
నీవిమలబుద్ధి నిశితమై నెగడుచుండు, నీయమృతబోధ సత్యమై నిలిచియుండు
నట్టి నీకెన యెవ్వ రీయవనియందు, సర్గఃణోద్దామ! సత్కవిసార్వభౌమ!
నీవు గనరానితావులు లేవు భువిని, నీ వెఱుఁగరాని కృత్యముల్ 'లేవు జగతి
గానిచోఁ బోతుటీఁగకు నైనఁ దూఱ, రాని రాజులు యంతిపురంబులందుఁ
గలవి
శేషంబు లెట్లు నీగ్రంథముల య, థాగతిం 'దెల్పనేరు? విద్వత మీద!
ప్రకృతిసృజియించునట్టి సద్బహ్మ వీవ, ప్రకృతిఁజ త్రించు చిత్ర కారకుఁడ వీవ
ప్రకృతి గానంబు సేయు గాయకుఁడవీన, ప్రకృతి నలరించు సత్యనీశ్వరుఁడ వీన
ప్రకృతి సౌందర్యమునుజూపుసుకృతివీవ, ప్రకృతి కాంతకుముద్దుపుత్ర కుఁడవీవ
యట్టినీ కివె జోహారు లందుకొనుము, ప్రథితగుణసాంద్ర ! సత్యవి రాజ చంద్ర !
అఖిలనిగ మేతిహా సరహస్యములను, అఖిలశాస్త్రపురాణరహస్యములను
అభిలగ్రంథార్థత త్వరహస్యములను, బలుకుపలుకుననమృతంబుచిలుకునటులఁ