ఈ పుటను అచ్చుదిద్దలేదు
అయ్యలరాజు అయ్యలభాస్కరకవులు
అయ్యలరాజవంశసంభవు లయినయయ్యలకవియు భాస్కరకవియు జేరి కాలస్వరూపాదులను దెలిపెడి రెట్టమత మనుగ్రంథమును కన్నడభాషనుండి యైదాశ్వాసముల పద్యకావ్యముగా దెనిగించిరి. ఈకవు లిరువురును క్రీస్తుశకము 1769వ సంవత్సరమునం దీపుస్తకమును దెలిగించినట్లుగా గ్రంథాంతమునందలి ఈక్రింది పద్యమువలన దెలియవచ్చుచున్నది.-