పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఈదురుపల్లి భవానిశంకరుడు.

ఈకవి ధర్మఖండమును దెనిగించెను. ఇతడు కూచిమంచి తిమ్మకవితోను వక్కలంక వీరభద్రకవితోను సమకాలికు డయినందున, ఇతడును పదునెనిమిదవ శతాబ్దారంభమునుండి 1750 వ సంవత్సర ప్రాంతములవఱకును జీవించియుండును. ఈకవి తన ధర్మఖండమున వక్కలంక వీరభద్రకవిని గూర్చివ్రాసిన "హరిశౌర్యుండగు", ననుపద్య మీవఱకే యుదాహరింపబడియున్నది.